రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 66 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించడంతో సిరీస్‌ను 2-1తో టీమిండియానే సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానుల మనసులను గెలుచుకున్నాడు.
రోహిత్ ఏం చేశాడంటే?
కాగా ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ గైర్హజరీ నేపథ్యంలో కేఎల్ రాహుల్ భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు అద్భుత విజయం సాధించింది. రాహుల్ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనతో అకట్టుకున్నాడు. ఇక మూడో వన్డే అనంతరం ప్రెజెంటేషన్ వేడుకలో విన్నింగ్ ట్రోఫీని అందుకోవాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మను హర్షబోగ్లే ఆహ్వానించాడు.
అయితే రోహిత్ ఇక్కడే తన మంచి మనసును చాటుకున్నాడు. ట్రోఫీని అందుకోవడానికి రోహిత్ తనకు బదులుగా రాహుల్‌ను వెళ్లమని ప్రోత్సహించాడు. అంతేకాకుండా ట్రోఫీతో ఫోటో దిగే సమయంలో కూడా రోహిత్ కేవలం ఒక్క ఆటగాడిగా మాత్రమే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హిట్‌మ్యాన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
చదవండి: Rohit Sharma: చాలా సంతోషంగా ఉన్నా.. అతడు మాత్రం అద్భుతం! వరల్డ్‌కప్‌లో కూడా
Captain @ImRo45 & @klrahul collect the @IDFCFIRSTBank Trophy as #TeamIndia win the ODI series 2⃣-1⃣ 👏👏#INDvAUS pic.twitter.com/k3JiTMiVGJ
— BCCI (@BCCI) September 27, 2023
Comments
Please login to add a commentAdd a comment