IPL 2023 RR VS DC: Rajasthan Royals Scored First Single On Innings 14th Delivery - Sakshi
Sakshi News home page

IPL 2023 RR VS DC: సింగిల్‌ కోసం 14 బంతుల వరకు ఆగాల్సి వచ్చింది..

Published Sat, Apr 8 2023 5:09 PM | Last Updated on Sat, Apr 8 2023 6:00 PM

RR VS DC: Rajasthan Royals Scored First Single On Innings 14th Delivery - Sakshi

pic credit: IPL twitter

గువాహటి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (31 బంతుల్లో 60; 11 ఫోర్లు, సిక్స్‌), జోస్‌ బట్లర్‌ (31 బంతుల్లో 60; 11 ఫోర్లు, సిక్స్‌) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి పరుగుల వరద పారించారు. వీరి ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఆరంభ ఓవర్లలో వీరికి బౌలింగ్‌ చేయటానికి డీసీ బౌలర్లు వణికిపోయారు. ఆ స్థాయిలో సాగింది యశస్వి-బట్లర్‌ జోడీ విధ్వంసం.

తొలి ఓవర్‌లో మొదలైన వీరి ఊచకోత 9వ ఓవర్‌లో యశస్వి ఔటయ్యేంతవరకు సాగింది. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో ఉగ్రరూపం ప్రదర్శించిన యశస్వి.. ఆ ఓవర్‌లో ఏకంగా 5 బౌండరీలు బాది 20 పరుగులు రాబట్టాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో ఇదే  అత్యంత విలువైన ఓవర్‌గా రికార్డైంది. ఆతర్వాత నోర్జే వేసిన రెండో ఓవర్‌లో ఊచకోత కోయడం బట్లర్‌ వంతైంది. నోర్జే వేసిన ఈ ఓవర్‌లో బట్లర్‌ 3 బౌండరీలు సాధించి, 12 పరుగులు పిండుకున్నాడు.

యశస్వి-బట్లర్‌ పోటీపడి మరీ బౌండరీలు బాదడంతో ఆర్‌ఆర్‌ స్కోర్‌ 2 ఓవర్ల తర్వాత వికెట్‌ నష్టపోకుండా 32 పరుగులుగా ఉండింది. ఇక్కడ ఓ గమనించదగ్గ విషయమేమిటంటే.. ఆర్‌ఆర్‌ ఇన్నింగ్స్‌లో సింగిల్‌ రన్‌ 14వ బంతికి కాని రాలేదు. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ పరుగు తీసి సింగిల్‌ రన్‌ బోణీ కొట్టాడు. 

కాగా, యశస్వి ఔటయ్యాక కొద్ది సేపు మందగించిన ఆర్‌ఆర్‌ స్కోర్‌ బోర్డు.. హెట్‌మైర్‌-బట్లర్‌ కలయికతో మళ్లీ పుంజుకుంది. 17 ఓవర్ల తర్వాత ఆ  జట్టు స్కోర్‌ 3 వికెట్ల నష్టానికి 157 పరుగులుగా ఉంది. బట్లర్‌ (69), హెట్‌మైర్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement