న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం క్రీడలకు ఇచ్చే వార్షిక బడ్జెట్‌ను స్వల్పంగా పెంచింది. మంగళవారం ప్రకటించిన 2024–25 ఆరి్థక సంవత్సర బడ్జెట్‌లో క్రీడలకు రూ. 3,442.32 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇచి్చన రూ.3,396.96 కోట్లతో పోలిస్తే ఇది రూ.45.36 కోట్లు ఎక్కువ. ఎప్పటిలాగే ఇందులో ఎక్కువ మొత్తం దిగువ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి తీర్చిదిద్దే ‘ఖేలో ఇండియా’ పథకానికే కేటాయించింది.
గత ఏడాదికంటే రూ.20 కోట్లు ఎక్కువగా ‘ఖేలో ఇండియా’కు ఈసారి రూ.900 అందిస్తున్నట్లు ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్‌ల నిర్వహణతో పాటు అత్యుత్తమ స్థాయి శిక్షణ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటు, అక్కడ సౌకర్యాల కల్పన కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు.
మరోవైపు దేశవ్యాప్తంగా స్టేడియాల నిర్వహణ, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోసం ఖర్చు చేసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ప్రభుత్వం రూ.822.60 కోట్లు కేటాయించింది. దేశంలోని వివిధ క్రీడా సమాఖ్యలకు ఈ సారి రూ.340 కోట్లు అందజేస్తున్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా), జాతీయ డోపింగ్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్‌డీటీఎల్)ల కోసం వరుసగా 21.73 కోట్లు, రూ. 22 కోట్ల చొప్పున కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment