Sanju Samson Lends Help Kerala Budding Footballer: టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న యువ ఫుట్‌బాల్ ఆటగాడికి అండగా నిలబడ్డాడు. కేరళలోని మన్నార్‌లో గల కుట్టంపెరూర్‌కు చెందిన ఆదర్శ్ తిరువళ్లలో డిగ్రీ చదువుతున్నాడు. చిన్ననాటి నుంచి ఫుట్‌బాల్ ఆటపై ఆసక్తి పెంచుకున్న అతడు.. వివిధ టోర్నీల్లో తన ప్రతిభ నిరూపించుకున్నాడు.
ఈ క్రమంలో స్పానిష్ ఫుట్‌బాల్ జట్టు సీడీ లా విర్జెన్ డెల్ కామినోతో మమేకమయ్యేందుకు వీలుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యాడు. నెలరోజుల పాటు జరుగనున్న ప్రోగ్రామ్ కోసం అతడు స్పెయిన్ వెళ్లాల్సి ఉంది. అయితే, అందుకు తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆదర్శ్.. చెంగనూర్ ఎమ్మెల్యే, క్రీడా శాఖా మంత్రి సజీ చెరియన్‌ను ఆశ్రయించాడు. తన స్పెయిన్ ట్రిప్పునకు నిధులు సమకూర్చాల్సిందిగా కోరాడు.
PC: Saji Cherian Facebook
ఈ క్రమంలో మంత్రి చెరియన్ ఆదర్శ్‌తో కలిసి ఉన్న ఫొటోను శుక్రవారం రాత్రి ఫేస్‌బుక్‌లో షేర్ చేసి.. అతడికి సహాయం అందించాల్సిందిగా కోరారు. ఇందుకు స్పందించిన సంజూ శాంసన్.. ఆదర్శ్ ప్రయాణానికి కావాల్సిన విమాన టిక్కెట్ల కొనుగోలు బాధ్యతను తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు సంజూ శాంసన్ గొప్ప మనసును అభినందిస్తున్నారు. మరోవైపు కరకోడే లియో క్లబ్ ఆదర్శ్ ఖర్చుల కోసం 50 వేల రూపాయలు జమచేసింది.
PC: Saji Cherian Facebook
ఇక కేరళకు చెందిన సంజూ శాంసన్ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడటంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు అతడిని ఎంపిక చేయకపోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును విమర్శిస్తున్నారు.
చదవండి: #JusticeForSanjuSamson: మా గుండె పగిలింది.. అసలేంటి ఇదంతా?!
Comments
Please login to add a commentAdd a comment