టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమై జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్.. ఇప్పుడు ఐపీఎల్-2024లోనూ అదే తీరును కనబరిచాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు.
కేకేఆర్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన అయ్యర్.. డకౌట్‌గా వెనుదిరిగాడు. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. నటరాజన్ బౌలింగ్‌లో కమ్మిన్స్‌కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు.
ఈ క్రమలో అయ్యర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ చెత్త ఆటతో భారత జట్టులోకి ఎంట్రీ కష్టమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను సైతం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఎస్ఆర్‌హెచ్‌పై 4 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది.
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. ఎస్‌ఆర్‌హెచ్ 7 పరుగులు మాత్రమే చేయడంతో సన్‌రైజర్స్ పరాజయం పాలైంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిస్ క్లాసెన్(29 బంతుల్లో 63) విరోచిత పోరాటం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment