
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన శుబ్‌మన్ ఆఖరి క్రీజులోకి జట్టుకు భారీ స్కోర్ సాధించాడు. గిల్ తన ట్రెడ్ మార్క్‌లతో అభిమానులను అలరించాడు.
48 బంతులు ఎదుర్కొన్న గిల్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లో గిల్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అదే విధంగా ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడు కూడా శుబ్‌మనే కావడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో జట్టు 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్‌తో పాటు రాహుల్ తెవాటియా(23) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 2, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.
Cricket fan might say Shubman Gill is not big match because of his World Cup final failure.
— Sujeet Suman (@sujeetsuman1991) April 4, 2024
But just a reminder, he was under extreme pressure in test series almost in every inning & he delivered almost every fuking time.
Next generation belongs to Gillpic.twitter.com/FVBa2H6wVm
Comments
Please login to add a commentAdd a comment