సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్ (PC: X)
టీమిండియా స్టార్ బౌలర్, టీ20 ప్రపంచకప్-2024 విజేత మహ్మద్ సిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సిరాజ్‌ను అభినందించారు. వరల్డ్‌కప్ గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా.. శాలువా కప్పి, పుష్ఫ గుచ్ఛం అందించి.. నందిని సిరాజ్‌కు బహూకరించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచకప్ పతకాన్ని సిరాజ్ మియాన్ మెడలో వేసి ప్రశంసించారు.
అనంతరం సిరాజ్.. సీఎం రేవంత్ రెడ్డికి తన టీమిండియా జెర్సీని బహూకరించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ నేత, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత క్రికెట్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఏడు పరుగుల స్వల్ప తేడాతో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది రోహిత్ సేన.
ఇక టోర్నీలో సిరాజ్ ఒకే ఒక్క వికెట్ తీసినప్పటికీ.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. అయితే, ఫైనల్లో తుదిజట్టులో మాత్రం ఈ హైదరాబాదీ పేసర్‌కు ఆడే అవకాశం రాలేదు.
ఇదిలా ఉంటే.. ఐసీసీ టైటిల్ గెలిచిన టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లతో కలిసి సిరాజ్ ప్రధాన మంత్రి ఇచ్చిన విందులో పాల్గొన్నాడు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రాగా నగరవాసులు ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment