T20 WC: Perish Last Chance For Kohli In T20 Setup Says Reports - Sakshi
Sakshi News home page

Virat Kohli: ఇదే చివరి అవకాశం.. రిపీట్‌ అయితే ప్రపంచకప్‌ జట్టు నుంచి కోహ్లి అవుట్‌!

Published Thu, Jul 7 2022 11:56 AM | Last Updated on Thu, Jul 7 2022 1:54 PM

T20 WC: Perform Or Perish Last Chance For Kohli In T20 Setup Says Reports - Sakshi

విరాట్‌ కోహ్లి(PC: BCCI)

India Vs England T20 Series-Virat Kohli: విరాట్‌ కోహ్లి.. టీమిండియా కెప్టెన్‌గా... స్టార్‌ బ్యాటర్‌గా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. సారథిగా ఎన్నో విజయాలు సాధించిన కోహ్లి.. పరుగుల యంత్రంగా పేరుగాంచి కోట్లాది మంది అభిమానం చూరగొన్నాడు. టీమిండియా ముఖ చిత్రంగా మారి కింగ్‌ కోహ్లి అని ఫ్యాన్స్‌ చేత విజిల్స్‌ వేయించుకున్నాడు. అయితే, గత కొంత కాలంగా సీన్‌ మారింది.

ఒకప్పుడు రన్‌ మెషీన్‌గా ఓ వెలుగు వెలిగిన కోహ్లి.. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మరోవైపు... యువ బ్యాటర్లు మెరుపు వేగంతో దూసుకువస్తున్నారు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్‌లో తమ ప్రతిభను నిరూపించుకుని జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నారు.

దీంతో సెలక్టర్లు సైతం జట్టు ఎంపిక విషయంలో సందిగ్దంలో పడే పరిస్థితి. ఇలాంటి సమయంలో కోహ్లి గనుక రాణించకపోతే తుది జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో గనుక కోహ్లి రాణించకపోతే ఇదే అతడికి ఆఖరి సిరీస్‌ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్‌లో గనుక విరాట్‌ కోహ్లి రాణించకపోతే టీ20 ప్రపంచకప్‌-2022 జట్టులో స్థానం దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు.. ‘‘భారత క్రికెట్‌కు అతడు ఎనలేని సేవ చేశాడు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, గత కొన్ని రోజులుగా అతడు ఫామ్‌లేమితో సతమతమవుతున్న విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు.

నిజానికి సెలక్టర్లు ఫామ్‌ ఆధారంగానే కదా జట్టుకు ఎంపిక చేసేది! అంతేగానీ వారి పేరు ప్రఖ్యాతుల గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే, నా అభిప్రాయం ప్రకారం.. కోహ్లి ఈ సిరీస్‌లో రాణిస్తేనే ముందుకు సాగుతాడు.

నాకు తెలిసి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కోహ్లి విఫలమైతే టీ20 వరల్డ్‌ కప్‌ జట్టులో అతడికి ప్రత్యామ్నాయాలను సెలక్టర్లు కచ్చితంగా వెదుకుతారు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.

చదవండి: Virat Kohli: ఆరేళ్లలో ఇదే తొలిసారి.. అయినా నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే!
Trolls On BCCI: కోహ్లి తప్పుకొన్నాక.. పరిస్థితి మరీ ఇంతలా దిగజారిందేంటి? బీసీసీఐపై ట్రోల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement