
Shaheen Afridi Hyper Active Vs IND.. టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఇరుజట్ల మధ్య భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. తాజాగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది హైపర్ యాక్టివ్ అయ్యాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ చివరి బంతిని హార్దిక్ పాండ్యా ఫ్లిక్ చేయడంలో విఫలమయ్యాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న భువనేశ్వర్ సింగిల్‌కు కాల్ ఇవ్వడంతో పరిగెత్తాడు. దీంతో షాహిన్ అఫ్రిది కోపంతో బంతిని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరాడు. త్రో మిస్ అయి ఓవర్‌త్రో అవ్వడంతో నాలుగు పరుగులు అదనంగా.. ఓవరాల్‌గా ఆరు పరుగులు వచ్చాయి. ఒకవేళ టీమిండియా 5 పరుగుల తేడాతో గెలిస్తే మాత్రం పరోక్షంగా పాక్ ఓటమికి కారణం అఫ్రిది అవుతాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.
ఇక మ్యాచ్ ఆరంభంలో టీమిండియాను షాహిన్ అఫ్రిది వరుస ఓవర్లలో దెబ్బతీశాడు. రోహిత్ శర్మను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన అఫ్రిది తన తర్వాతి ఓవర్లో కేఎల్ రాహుల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక చివరగా కెప్టెన్ కోహ్లిని 18వ ఓవర్‌లో ఔట్ చేసి మొత్తంగా మూడు వికెట్లు తీసుకున్నాడు. అయితే చివరలో షాహిన్ అఫ్రిది హైపర్ యాక్టివ్ అవ్వడం వైరల్‌గా మారింది.