Virat Kohli Never Dismissed Against Pakistan in T20 World Cup Matches: టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దాయాది పాకిస్థాన్‌పై అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నాడు. మెగా వేదికపై పాక్‌తో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా అజేయంగా నిలిచాడు. 2012 ప్రపంచకప్‌లో 61 బంతుల్లో 78 నాటౌట్, 2014లో 36 బంతుల్లో 38 నాటౌట్, 2016 వరల్డ్‌కప్‌లో 37 బంతుల్లో 55 నాటౌట్‌గా నిలిచి పాక్ పాలిట కొరకరాని కొయ్యలా మారాడు. ఈ 3 మ్యాచ్‌ల్లో 169 పరుగులతో అజేయంగా నిలిచిన విరాట్.. 130కిపైగా స్ట్రయిక్ రేట్ కలిగి ఉన్నాడు.
ఓవరాల్‌గా పాక్‌తో తలపడిన అన్నీ టీ20 మ్యాచ్‌ల్లో సైతం కింగ్ కోహ్లి అదిరిపోయే రికార్డును కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు పాక్‌తో అతను ఆడిన 6 టీ20ల్లో 84.66 సగటుతో 254 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. పాక్‌తో మ్యాచ్ అంటే విరాట్ ఏ రేంజ్‌లో విరుచుకుపడతాడో ఈ గణాంకాలను చూస్తే స్పష్టమవుతుంది. ఈనెల 24న జరగనున్న మ్యాచ్‌లో సైతం ఇదే తరహాలో రెచ్చిపోవాలని యావత్ భారతావని ఆశిస్తుంది.
చదవండి: అదంతా గతం.. ఈసారి చరిత్రను తిరగరాస్తాం: బాబర్ అజమ్
Comments
Please login to add a commentAdd a comment