T20 World Cup 2022, West Indies Vs Ireland: Ireland Beat West Indies By 9 Wickets In Hobart - Sakshi
Sakshi News home page

T20 WC 2022: ఐర్లాండ్‌ చేతిలో వెస్టిండీస్‌ ఘోర పరాజయం.. టోర్నీ నుంచి అవుట్‌

Published Fri, Oct 21 2022 9:13 AM | Last Updated on Tue, Oct 25 2022 5:23 PM

T20 World Cup 2022: WI vs IRE Match Highlights and Updates - Sakshi

ఐర్లాండ్‌ చేతిలో విండీస్‌ ఘోర పరాజయం.. టోర్నీ నుంచి ఔట్‌
ఐర్లాండ్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి వెస్టిండీస్‌  నిష్రమించింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలోనే చేధించింది. 

ఐరీష్‌ బ్యాటర్లలో ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌(43 బంతుల్లో 65 నాటౌట్‌), బల్బిర్నీ(37) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. అదే విధంగా వికెట్‌ కీపర్‌ టక్కర్‌(45) పరుగులతో రాణించాడు. ఇక విండీస్‌ బౌలర్లలో హోసన్‌ ఒక్క వికెట్‌ సాధించాడు. కాగా అద్భుతమైన విజయం సాధించిన ఐర్లాండ్‌ సూపర్‌-12 అర్హత సాధించింది.

ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.విండీస్‌ బ్యాటర్లలో బ్రాండన్‌ కింగ్‌(62 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. విండీస్‌ కెప్టెన్‌ పూరన్‌ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో పూరన్‌ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక ఐర్లాండ్‌ బౌలర్లలో డెన్లీ మూడు, మెక్‌గ్రాతి, సిమి సింగ్ తలా వికెట్‌ సాధించారు.

విజయం దిశగా ఐర్లాండ్‌
వెస్టిండీస్‌తో కీలక మ్యాచ్‌లో ఐర్లాండ్‌ విజయం దిశగా ఐర్లాండ్‌ అడుగులు వేస్తోంది. 12 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్‌ వికెట్‌ కోల్పోయి 110 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ విజయానికి 42 బంతుల్లో 32 పరుగులు కావాలి.

తొలి వికెట్‌ కోల్పోయిన ఐర్లాండ్‌
73 పరుగులు వద్ద ఐర్లాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 37 పరుగులు చేసిన బల్బిర్నీ.. హోసన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

దూకుడుగా ఆడుతోన్న ఐర్లాండ్‌.. 6 ఓవర్లకు 64/0
147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా ఐర్లాండ్‌.. వికెట్‌ నష్టపోకుండా 64 పరుగులు చేసింది. క్రీజులో పాల్ స్టిర్లింగ్(32), ఆండ్రూ బల్బిర్నీ(31) పరుగులతో ఉన్నారు.

3 ఓవర్లకు  ఐర్లాండ్‌ స్కోర్‌: 31/0
3 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో పాల్ స్టిర్లింగ్(22), ఆండ్రూ బల్బిర్నీ(8) పరుగులతో ఉన్నారు.

హాఫ్‌ సెంచరీతో చెలరేగిన కింగ్‌.. ఐర్లాండ్‌ టార్గెట్‌ 147 పరుగులు
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. విండీస్‌ బ్యాటర్లలో బ్రాండన్‌ కింగ్‌(62 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. విండీస్‌ కెప్టెన్‌ పూరన్‌ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో పూరన్‌ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక ఐర్లాండ్‌ బౌలర్లలో డెన్లీ మూడు, మెక్‌గ్రాతి, సిమి సింగ్ తలా వికెట్‌ సాధించారు.

17 ఓవర్లకు విండీస్‌ స్కోర్‌: 112/5
17 ఓవర్లు ముగిసే సరికి విండీస్‌ 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. క్రీజులో కింగ్‌(50), ఒడియన్‌ స్మిత్‌ ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన విండీస్‌
71 పరుగుల వద్ద విండీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన లూయిస్‌..  డెన్లీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

రెండో వికెట్‌ డౌన్‌
జాన్సన్‌ చార్లెస్‌ రూపంలో వెస్టిండీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఐదు ఓవర్లు ముగిసే సరికి విండీస్‌ స్కోరు 32-2.

తొలి వికెట్‌ కోల్పోయిన విండీస్‌
10 పరుగుల వద్ద వెస్టిండీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మెక్‌గ్రాతి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

2 ఓవర్లకు వెస్టిండీస్‌ స్కోర్‌: 9/0
2 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్‌ వికెట్‌ కోల్పోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో మైర్స్‌(1), చార్లెస్‌(8) పరుగులతో ఉన్నారు.

టీ20 ప్రపంచకప్‌-2022 క్వాలిఫియర్స్‌(గ్రూప్‌-బి)లో వెస్టిండీస్‌, ఐర్లాండ్‌ జట్లు చావోరేవో తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. హోబార్ట్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఏజట్టు అయితే విజయం సాధిస్తుందో ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సూపర్‌-12కు అర్హత సాధిస్తుంది.
తుది జట్లు: 
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ(సి), లోర్కాన్ టక్కర్(వికెట్‌ కీపర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్

వెస్టిండీస్: కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్(వైస్‌ కెప్టెన్‌), రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
చదవండి: T20 World Cup 2022: గెలిచి శ్రీలంక.. ఓడి నెదర్లాండ్స్‌...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement