
సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేయబోతున్నట్లు తెలుస్తుంది. కాన్పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత మేనేజ్‌మెంట్ అదనపు స్పిన్నర్‌తో బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ లెక్కన తొలి టెస్ట్‌లో ఆడిన పేసర్ ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్ప్ ఉంది. ఇప్పటివకే అశ్విన్, జడేజా వంటి నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. వీరికి కుల్దీప్ తోడైతే స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్‌పై ప్రత్యర్ధికి కష్టాలు తప్పవు. అశ్విన్, జడేజా, కుల్దీప్‌తో పాటు పేసర్లుగా బుమ్రా, సిరాజ్ బరిలోకి దిగడం దాదాపు ఖరారైనట్లే.
బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. తొలి టెస్ట్‌లో ఆడిన బ్యాటర్లే రెండో టెస్ట్‌లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, ఐదో ప్లేస్‌లో రిషబ్ పంత్, ఆరో స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లే.
వీరిలో రోహిత్, కోహ్లి, రాహుల్ మినహా మిగతా ముగ్గురూ మాంచి టచ్‌లో ఉన్నారు. మొత్తంగా చూస్తే రెండో టెస్ట్‌లో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
కాగా, చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో సత్తా చాటి పర్యాటక జట్టుపై సంపూర్ణ ఆధిపత్యం చలాయింది.
అశ్విన్ (113, 6/88), జడేజా (86, 2/19, 3/58) ఆల్‌రౌండ్ షోతో ఇరగదీయగా.. గిల్ (119 నాటౌట్), పంత్ (109) అదిరిపోయే శతకాలతో ఆకట్టుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment