విరాట్‌ జన్మదినం.. శుభాకాంక్షల వెల్లువ | Virat Kohli 35th Birthday Wishes From Celebrities | Sakshi
Sakshi News home page

విరాట్‌ జన్మదినం.. శుభాకాంక్షల వెల్లువ

Published Sun, Nov 5 2023 1:26 PM | Last Updated on Sun, Nov 5 2023 2:14 PM

Virat Kohli 35th Birthday Wishes From Celebrities - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఇవాళ (నవంబర్‌ 5) 35వ పడిలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు కోహ్లికి బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. కోహ్లి ఇలాంటి బర్త్‌డేలు మున్ముందు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కోహ్లి ఈసారి ఎలాగైనా టీమిండియాకు వరల్డ్‌కప్‌ అందించి తీరాలని కోరుకుంటున్నారు.

ప్రత్యేకించి కోహ్లి ఫ్యాన్స్‌ పోస్ట్‌లతో సోషల్‌మీడియా తడిసిముద్దైపోతుంది. పుట్టిన రోజు నాడు కోహ్లి సౌతాఫ్రికాపై సెంచరీ సాధించి, సచిన్‌ రికార్డును (వన్డేల్లో అత్యధిక సెంచరీలు (49)) సమం చేయాలని ఆశిస్తున్నారు. కోహ్లిని విష్‌ చేసిన వారిలో సామాన్యులు, అభిమానులతో పాటు అన్ని రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, క్రికెట్‌ బోర్డులు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరాట్‌కు ‍ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.

కాగా, వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇవాళ భారత్‌-సౌతాఫ్రికా జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఇవాళ విరాట్‌ పుట్టిన రోజు కావడంతో బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. స్టేడియంలోకి వచ్చే ప్రతి అభిమానికి కోహ్లి మాస్క్‌ను ఫ్రీగా అందించనుంది. మ్యాచ్‌కు ముందు కోహ్లిచే కేక్‌ కటింగ్‌ ప్రోగ్రాం కూడా ఉంటుందని సమాచారం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement