డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో రాణించాడు. 182 బంతుల్లో 76 పరుగులు చేసిన కోహ్లి.. తన 29వ టెస్టు సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవి ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
►విరాట్ కోహ్లి టెస్టు కెరీర్‌లో ఇది మూడో స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ. 2012 నాగ్‌పూర్ టెస్టులో 171 బంతుల్లో అర్ధ శతకం సాధించిన కోహ్లి.. 2022లో దక్షిణాఫ్రికాపై 59 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం విండీస్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో 147 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
►విదేశాల్లో అత్యధిక సార్లు ఫిప్టి ప్లస్ పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కాడు. విరాట్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్‌లు కలిపి 88 సార్లు 50 పైగా పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(87)పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ద్రవిడ్‌ను కోహ్లి అధిగిమించాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(96) అగ్రస్ధానంలో ఉన్నాడు. టెస్టుల్లో విదేశాల్లో విరాట్ కోహ్లీకి ఇది 31వ ఫిప్టి ప్లస్ స్కోరు కావడం గమనార్హం.
►ఇక టీమిండియా తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో టాప్‌లో ఉండగా.. రాహుల్ ద్రావిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,112), వీవీఎస్ లక్ష్మణ్ (8781), కోహ్లి(8555) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.
చదవండి: Rohit Sharma Serious On Ishan Kishan: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్‌పై రోహిత్ సీరియస్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment