టీ20ల్లో దుమ్ము రేపుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో మాత్రం తన శైలికి బిన్నంగా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో సూర్య గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో సూర్య వన్డేలకు పనికిరాడని, అతడి స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని పలువరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వరుస మ్యాచ్‌ల్లో విఫలమైన సూర్యకుమార్‌ను మూడో వన్డేకు పక్కన పెట్టాలని, అతడి స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని జాఫర్ సూచించాడు. కాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ జట్టులో శాంసన్‌కు చోటు దక్కలేదు.
"మిచెల్ స్టార్క్‌ను ఎదుర్కొవడం బ్యాటర్లకు అంత సులభం కాదు. అతడు కొత్త బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తాడు. కాబట్టి తొలి వన్డేలో 145 కి.మీ వేగంతో స్టార్క్ వేసిన బంతికి సూర్య వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతిని అంచనా వేయడంలో సూర్య విఫలమయ్యాడని అంతా భావించారు. కానీ రెండో వన్డేలో కూడా అదే రీతిలో తన వికెట్‌ను కోల్పోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే స్టార్క్ స్టంప్స్‌ను అటాక్ చేస్తాడని సూర్యకు ముందే తెలుసు.
కాబట్టి సూర్య తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకోని ఆడాల్సింది. ఇక మూడో వన్డేలో టీమ్ మేనేజ్‌మెంట్ సూర్యను కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. నా వరకు అయితే సంజూ శాంసన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే శాంసన్ తనకు అవకాశం వచ్చిన ప్రతీసారి తానేంటో నిరూపించుకున్నాడు" అని జాఫర్ ఈఎస్‌ప్పీఈన్‌తో పేర్కొన్నాడు. ఇక సిరీస్ ఫలితాన్ని తెల్చే మూడో వన్డే మార్చి 22న చెన్నై వేదికగా జరగనుంది.
చదవండి: NZ vs SL: ఇదేం బంతిరా బాబు.. బ్యాటర్ అస్సలు ఊహించి ఉండడు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment