వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. నిర్ణీత సమయంలో క్రీజులో గార్డ్ తీసుకుపోనుందున మాథ్యూస్ టైమ్డ్ అవుట్ పెవిలియన్‌కు చేరాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలా జరగడం ఇదే తొలి సారి.
ఏమి జరిగిందంటే?
శ్రీలంక ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో రెండో బంతికి సమరవిక్రమ ఔటయ్యాడు. వెంటనే ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే క్రీజులోకి వచ్చిన మాథ్యూస్ సరైన హెల్మెట్‌ను తీసుకురాలేదు. క్రీజులో గార్డ్ తీసుకోనే సమయంలో తన హెల్మెట్ బాగో లేదని మాథ్యూస్ గమనించాడు. దీంతో వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌వైపు కొత్త హెల్మెట్ కోసం మాథ్యూస్ సైగలు చేశాడు.
వెంటనే సబ్‌స్ట్యూట్ కరుణరత్నే పరిగెత్తుకుంటూ వచ్చి హెల్మెట్‌ను తీసుకువచ్చాడు. అయితే ఇదంతా జరగడానికి మూడు నిమషాల పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్ధి బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్డ్ అవుట్‌కు అప్పీలు చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్‌లు చర్చించుకుని మాథ్యూస్‌ను ఔట్‌గా ప్రకటించారు.
టైమ్డ్ అవుట్ అంటే ఏంటి?
ఎంసీసీ నిబంధన ప్రకారం.. వికెట్ పడిన తర్వాత లేదంటే.. బ్యాటర్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే... సదరు ప్లేయర్ స్థానంలో వచ్చే బ్యాటర్ నిర్ణీత సమయంలో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మైదానంలోకి వచ్చిన మూడు నిమిషాల్లోపే బాల్‌ను ఫేస్ చేయాలి. లేదంటే బ్యాటర్‌ను టైమ్డ్ అవుట్‌గా పరిగణిస్తారు. మాథ్యూస్ విషయంలో ఇదే జరిగింది. అయితే క్రీడా స్పూర్తిని మరిచి ఇలా చేసిన బంగ్లాదేశ్‌ను నెటిజన్లు తప్పబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment