ICC World Cup 2023: పాకిస్తాన్ జట్టుకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ తెలిపాడు. ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌లు ఆడే విషయంలో పాక్ ఆటగాళ్లకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నాడు. కోల్‌కతా పోలీసులపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నాడు.
అక్కడ ఆడలేం
భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలో పాక్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, తాము చెన్నై, కోల్‌కతాలో మ్యాచ్‌లు ఆడలేమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి విన్నవించుకున్నట్లు సమాచారం.
కోల్‌కతా పోలీసులపై నమ్మకం ఉంది
ఈ నేపథ్యంలో CAB అధ్యక్షుడు స్నేహాశిష్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కోల్‌కతాలో మ్యాచ్‌ల నిర్వహణపై మాకు పూర్తి నమ్మకం ఉంది. పాకిస్తాన్ జట్టు కోసం ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. పాకిస్తాన్ గతంలో కూడా కోల్‌కతాలో ఆడిందనుకుంటా!
మరి వాళ్లకు ఇప్పుడేమైందో తెలియదు కానీ చెన్నై, బెంగళూరు తర్వాత కోల్‌కతాలోనే వాళ్లు రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. కోల్‌కతా పోలీసులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నార్మల్ మ్యాచ్‌లలా కాకుండా మరింత ఎక్కువ భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నా.
అదే విధంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పాలనాయంత్రాంగం మీద కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. మాకు వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం రావడం పట్ల సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు వన్డే ప్రపంచకప్ ఈవెంట్ జరుగనుంది.
వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్, వివరాలు:
►అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2
►అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ భారత్
►అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా
►అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్
►అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా
►అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs బంగ్లాదేశ్
►నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs న్యూజిలాండ్
►నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs ఇంగ్లాండ్
చదవండి: 2011 టోర్నీ మొత్తం ధోని కిచిడీనే తిన్నాడు: సెహ్వాగ్.. రోహిత్ ఆ వడాపావ్ మానేసి..
వరల్డ్‌కప్ వేదికలపై వివాదం.. బీసీసీఐ వివరణ
Comments
Please login to add a commentAdd a comment