Photo Credit : IPL Website
వాంఖేడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 17 పరుగులు అవసరమవ్వగా.. టిమ్ డెవిడ్ వరుసగా మూడు సిక్స్‌లు బాది చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓటమి పాలైనప్పటికీ.. ఆజట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం అద్భుతమైన సెంచరీతో మనసులను గెలుచుకున్నాడు.
Photo Credit : IPL Website
ఈ మ్యాచ్‌లో జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. 53 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న యశస్వి జైశ్వాల్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా జైశ్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక సెంచరీతో చెలరేగిన పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.
Photo Credit : IPL Website
జైశ్వాల్ సాధించిన రికార్డులు ఇవే..
►ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు భారత ఆటగాడు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన వాల్తాటి.. సీఎస్‌కేపై 120 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌తో వాల్తాటిని జైశ్వాల్ అధిగమించాడు.
Photo Credit : IPL Website
►అదే విధంగా ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన జోస్‌బట్లర్ రికార్డును యశస్వి సమం చేశాడు. 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై బట్టర్ కూడా 124 పరుగులు చేశాడు.
►ఐపీఎల్‌లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ల జాబితాలో జైశ్వాల్ నాలుగో స్థానంలో నిలిచాడు. 21 ఏళ్ల 123 రోజుల వయసులో జైశ్వాల్ ఈ ఫీట్ సాధించాడు. జైశ్వాల్ కంటే ముందు మనీష్ పాండే(2009లో ఆర్‌సీబీ తరపున 19 ఏళ్ల 253 రోజులు) తొలి స్థానంలో ఉండగా.. రిషబ్ పంత్( 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 20 ఏళ్ల 218 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్(2021లో ఆర్‌సీబీ తరపున 20 ఏళ్ల 289 రోజులు) ఉన్నారు.
చదవండి: #Rohit Notout: సంజూ చీటింగ్ చేశాడా.. రోహిత్ శర్మకు అన్యాయం!?
Comments
Please login to add a commentAdd a comment