ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తన సూపర్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండో టెస్టులో డబుల్ సెంచరీ నమోదు చేసిన జైశ్వాల్.. తాజాగా రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనప్పటకీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సూపర్ సెంచరీతో మెరిశాడు.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ రెహాన్ అహ్మద్, పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను జైశ్వాల్ ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 121 బంతుల్లో జైశ్వాల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 9 ఫోర్లు 5 సిక్స్‌లు ఉన్నాయి. కాగా జైశ్వాల్‌కు ఇది మూడో టెస్టు సెంచరీ. ఈ సిరీస్‌లో ఇది ముంబైకర్‌కు రెండో సెంచరీ కావడం గమనార్హం. కాగా జైశ్వాల్ ప్రస్తుతం 101 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 185 పరుగులు చేశాడు.
A leap of joy to celebrate his second century of the series 🙌
— BCCI (@BCCI) February 17, 2024
Well played, Yashasvi Jaiswal 👏👏#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/pdlPhn5e3N
Comments
Please login to add a commentAdd a comment