దాడులు, దమనకాండలు ఎల్లకాలం సాగవు
నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకరమైన పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం తమ పార్టీ శ్రేణులమీద దాడులు, దమనకాండలు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బాలాజీనగర్, చీపురుకట్టసంఘం ప్రాంతంలో కార్పొరేషన్ అధికారులు కూల్చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు చెందిన భవనాన్ని మంగళవారం ఎమ్మెల్సీ పర్వతరెడ్డితో పాటు పార్టీ నాయకులతో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దౌర్జన్యాలకు పరాకాష్టగా తమ పార్టీ కార్యకర్త బాలకృష్ణారెడ్డి ఇంటిని కూల్చివేశారన్నారు. బాలకృష్ణారెడ్డి తండ్రి సుబ్బారెడ్డి 40 సంవత్సరాలుగా ఇదే స్థలంలో నివాసం ఉంటున్నాడని.. అందుకు సంబంధించిన 80 ఏళ్ల డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మంత్రి నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇదేమన్నా మీ జాగీరా.. మీ ఇష్ట ప్రకారంగా వ్యవహరించేందు కోసమేనా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది అని ప్రశ్నించారు. కొంత మంది మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. వారంతా కిండల్ పడుతున్నారని ఇది మంచిది కాదని ఇలాగే వ్యవహరిస్తే మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత కిండల్ పడిన వారంతా కటకటాల పాలవుతారని హెచ్చరించారు. పంట కాలువలకు సంబంధించి వస్తే నారాయణ మెడికల్ కాలేజీ ఉండదన్నారు. ఆ కాలేజీ కింద ఎన్ని పంట కాలువలు పొతున్నాయో ప్రజలకు తెలుసన్నారు. నష్టపోయిన తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలను పార్టీ తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ విధ్వంసాలకు పాల్పడుతూ అందరినీ భయపెడుతున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్‌కు సంబంధించి లే అవుట్లలోని ఇళ్లను కూలదోసి వారిని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై మంత్రి నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కక్ష సాధింపులకు దిగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి నారాయణ, నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి ఇష్టారాజ్యంగా
వ్యవహరిస్తున్నారు
వైఎస్సార్‌సీపీ కార్యకర్తల కట్టడాల కూల్చివేతే మీ లక్ష్యమా?
జగన్ హయాంలో మేము
తలుచుకుంటే పంట కాలువ మీద
నారాయణ మెడికల్ కాలేజీ ఉండేదా
కిండల్ పడిన వారంతా ప్రభుత్వం మారినప్పుడు కటకటాల పాలవుతారు
విలేకరులతో మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment