అడవిలా ఉన్న ఆస్పత్రి ప్రాంగణం
● సర్వాయపాళెం పీహెచ్‌సీ పరిస్థితి
● జబ్బు చేస్తే కావలి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లాల్సిందే
కావలి: కావలి పట్టణ పొలిమేరకు కేవలం మూడు కిలో మీటర్లు దూరంలో సర్వాయపాలెం గ్రామం ఉంది. భౌగోళికంగా ఈ గ్రామం కావలి రూరల్ మండలంలో ఉంది. ఈ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు, 12 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు వైద్యులు, సిబ్బంది పీహెచ్‌సీకి చేరుకున్నారు. ఒక్క రోగి కూడా రాలేదు. 11 గంటలకు ఇద్దరు వచ్చి షుగర్ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వైద్యులను కలిసి ఆరోగ్య సలహాలు తీసుకున్నారు. గ్రామానికి సమీపంలో కావలి పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఉండటంతో రోగాలు సోకితే అక్కడికి పోవడానికే గ్రామస్తులు ప్రాధాన్యం ఇస్తుంటారు.
● సర్వాయపాళెం పీహెచ్‌సీ ఉన్న రోడ్డులో తల్లిని బైక్‌పై కూర్చోపెట్టుకొని కుమారుడు వెళ్తుండగా అతన్ని పలకరిస్తే మా అమ్మకు ఆరోగ్యం బాగా లేకపోతే కావలికి తీసుకెళ్లి వైద్యులకు చూపించుకొని తీసుకొస్తున్నాను అని చెప్పాడు. సర్వాయపాలెం పీహెచ్‌సీ ప్రాంగణంలో అడవిలా ఉంటుంది. దీంతో ప్రాంగణంలోని గుబురు చెట్లు పొదల్లో పందులు, కుక్కలు, పాములు, తేళ్లు వంటివి ఉంటాయి. అక్కడికి వెళ్తే లేని రోగాలు వస్తాయి అని అన్నారు. పీహెచ్‌సీలో బోర్ పనిచేయక మూల పడింది. అలాగే వాటర్ ట్యాంకర్ కూడా శిథిలమైపోయింది. దీంతో ఆస్పత్రిలో నీటి వసతి లేదు.
Comments
Please login to add a commentAdd a comment