ఫీజు చెల్లించేందుకు చివరి అవకాశం
నెల్లూరు(టౌన్): ఈ ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు తాత్కాల్ – 2 కింద రూ.3 వేలు చెల్లించేందుకు బుధవారం వరకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించినట్లు ఆర్ఐఓ శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ఫీజు చెల్లించని విద్యార్థులకు తెలియజేయాలన్నారు.
నీటి వనరులపై జలగణన
నెల్లూరు రూరల్: నీటి వినియోగాన్ని సమర్థవంతంగా చేయడానికి తద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి జలగణన ఉపయోగపడుతుందని జేసీ కె.కార్తీక్ అన్నారు. జిల్లాలో ఏడు చిన్న తరహా నీటి వనరుల గణన, 2 జలాశయాల గణనను నిర్వహించేందుకు జిల్లాస్థాయి శిక్షణ మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగింది. దీనిని ప్రారంభించిన జేసీ మాట్లాడుతూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం మేరకు జరుగుతున్న చిన్న తరహా నీటి వనరులు, జలాశయాల గణనను పక్కాగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ నరసింహారావు, సహాయ సంచాలకులు ఆయేషా, ఎస్ఓ శ్యామ్‌కుమార్, వివిధ మండలాల ఏఎస్ఓలు పాల్గొన్నారు.
మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి
ముత్తుకూరు: ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్కో థర్మల్ ప్రాజెక్టులో మంగళవారం మూడు యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి జరుగుతోందని ఇంజనీర్లు తెలిపారు. ఇందులో భాగంగా 1వ యూనిట్లో 540 మెగావాట్లు, 2వ యూనిట్లో 690 మెగావాట్లు, 3వ యూనిట్లో 740 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందన్నారు.
కార్పొరేషన్ స్థలంలో
హెచ్చరిక బోర్డు ఏర్పాటు
నెల్లూరు(బారకాసు): ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన సమీపంలోని నెల్లూరు బిట్–1 గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 140, 141లోని లే అవుట్లో ప్రజా ప్రయోజనాల కోసం రిజర్వు చేసిన 250 అంకణాల స్థలాన్ని టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించిన విషయంపై ఈనెల 18న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. స్పందించిన కార్పొరేషన్ అధికారులు ఆ స్థలం కార్పొరేషన్‌కు చెందినదని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment