టిడ్కో సముదాయాల్లో రామాలయాల నిర్మాణం
నెల్లూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కో గృహాల సముదాయాల్లో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రామాలయాల నిర్మాణం చేపట్టనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఇన్‌చార్జి కలెక్టర్ కార్తీక్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 9వ తేదీన ఆత్మకూరు పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని వెల్లడించారు. దీనికి మంత్రులు హాజరవుతారన్నారు. ఆత్మకూరు టిడ్కో కాలనీలో రామాలయానికి శంకుస్థాపన చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment