ఫీజు పోరుకు సన్నద్ధమవ్వండి
నెల్లూరు (బారకాసు): విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే ఇవ్వాలంటూ తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు 5న ‘పోరుబాట’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నగరంలోని డైకస్‌రోడ్డులోని పార్టీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు, విద్యార్థులతో కలిసి ‘ఫీజుపోరు’ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 5న నగరంలోని వీఆర్సీ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, తల్లితండ్రులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం విద్యాదీవెన కింద రూ.2,800 కోట్లు, వసతిదీవెన కింద రూ.1,100 కోట్ల కలిపి మొత్తం రూ.3,900 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. దీంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను తరగతులకు రానివ్వడం లేదని, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు. పేద విద్యార్థులు చదువులు మానుకుని కూలి పనులు చేసుకోవాల్సిన దుస్థితిని సీఎం చంద్రబాబు కల్పించారని ధ్వజమెత్తారు. ప్రతి పేద విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని ఆకాంక్షిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తే చంద్రబాబు వారి భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పేద కుటుంబాలకు పిల్లల చదువులు భారం కాకూడదనే ఉద్దేశంతో దివంగత వైఎస్సార్ రూపకల్పన చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పటిష్టంగా అమలు చేశారన్నారు. విద్యార్థులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదని, కచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థులకు న్యాయం జరిగేలా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికై నా కళ్లు తెరచి ఫీజు బకాయిలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’లో పార్టీ శ్రేణులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థు లు, తల్లిదండ్రులు పాల్గొని జయప్రదం చేయాలని కాకాణి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్‌ఇన్‌చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి, పార్టీ విద్యార్థి విభాగంగా జిల్లా అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షరాలు లక్ష్మీసునంద తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆందోళన
ఫిబ్రవరి 5న జిల్లా కేంద్రంలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
జిల్లా పార్టీ కార్యాలయంలో
విద్యార్థి సంఘ నేతలతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment