‘జువ్వలదిన్నె’కు వైఎస్ జగన్ శ్రీకారం
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల శాశ్వత జీవనోపాధికి భరోసా కల్పించాలనే సంకల్పంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద 116 ఎకరాల విస్తీర్ణంలో రూ.288.80 కోట్లతో నిర్మించేందుకు 18 మార్చి 2021న అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మాణ సంస్థకు పనులు అప్పగించి, రెండేళ్లలో పూర్తి చేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. మరుసటి రోజే.. అంటే 19 మార్చి 2021న ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులకు సీఎం హోదాలో వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలగాలనే లక్ష్యంతో, 1,250 బోట్లు నిలిపేలా హార్బర్ పనులు చేపట్టారు. ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment