నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు

Published Sat, Feb 1 2025 12:23 AM | Last Updated on Sat, Feb 1 2025 12:22 AM

నేటి

నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్య వంటి పోరాటయోధుల సొంత గడ్డపై సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న మహాసభలకు ఆతిథ్యం ఇస్తున్న నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్‌లోని అనిల్‌గార్డెన్స్‌లో సీతారాం ఏచూరి ప్రాంగణం సర్వం సిద్ధమైంది. వీఆర్సీ మైదానంలో ‘మల్లు స్వరాజ్యం’ ప్రాంగణం పేరుతో 3వ తేదీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ మహాసభలకు రాష్టం నలుమూలల నుంచి 500 మందికి పైగా ప్రతినిధులు, కేంద్ర కమిటీ నుంచి పదుల సంఖ్యలో నాయకులు రానున్నారు. సీపీఎం ఇప్పటి వరకు ఎక్కడా జరగని రీతిలో మహాసభలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దేశ స్థాయిలో కమ్యూనిస్టు ఉద్యమం పునరుత్తేజానికి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నారు.

సీపీఎం ఆవిర్భావానికి ‘పుచ్చలపల్లి’ ఆధ్యుడు

1964వ సంవత్సరం వరకు దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సీపీఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా) విడిపోయి సీపీఎం (కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు)గా అవతరించింది. కమ్యూనిస్టు ఉద్యమ సారథి పుచ్చలపల్లి సుందరయ్య ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత కాలంలో దేశంలోనే అతి పెద్ద పార్టీగా తీర్చిదిద్దారు. తొలిసారిగా సీపీఎం జాతీయ కార్యదర్శిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నిక కావడం విశేషం. ప్రతి మూడేళ్లకు ఒకసారి పార్టీ మహాసభలు నిర్వహించడం జరుగుతోంది. దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడిన తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య పర్యవేక్షణలో 1978లో నెల్లూరులో 13వ సీపీఎం రాష్ట్ర మహాసభలు జరిగాయి. తిరిగి 47 ఏళ్ల తర్వాత 27వ మహాసభలకు నెల్లూరు సిద్ధమైంది.

ఎరుపెక్కిన నెల్లూరు నగరం

సీపీఎం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్న నేపథ్యంలో నెల్లూరు నగరం ఎరుపెక్కింది. నగరంలోని వెంకటేశ్వరపురం నుంచి బుజబుజనెల్లూరు వరకు 54 డివిజన్లలో ఎక్కడ చూసిన ఎర్ర జెండాలతో అలంకరించారు. ప్రతి డివిజన్‌లో స్వాగత కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్ర మహాసభలకు విశాఖపట్నం, పోలవరం, తాడేపల్లి, నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల నుంచి ఐదు ప్రధాన సమస్యలపై పతాక యాత్రలు ప్రచారం చేస్తూ శుక్రవారం రాత్రికి నెల్లూరు నగరానికి రానున్నాయి.

పోరాట యోధుల స్ఫూర్తితో..

నేడు, రేపు ప్రతినిధుల సమావేశం, 3వ తేదీ భారీ ర్యాలీ, బహిరంగ సభ

హాజరుకానున్న పార్టీ కేంద్ర నాయకులు

47 ఏళ్ల తర్వాత ఆతిథ్యం ఇస్తున్న

సింహపురి

ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి

కమ్యూనిస్టు పోరాట యోధులకు, ఉద్యమాలకు పురిటిగడ్డ సింహపురి. దేశ స్థాయిలో చారిత్రాత్మక ఉద్యమ ఘట్టాలుగా నిలిచిన భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాల నుంచి.. సారా వ్యతిరేక పోరాటం, అక్షరాస్యత ఉద్యమాలకు నెల్లూరు నుంచే అడుగులు పడ్డాయి. చట్ట సభల్లో కమ్యూనిస్టుల వాణి వినిపించిన పోరాట యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్య పుట్టిన నేలపై నాలుగున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్ర మహాసభలకు సింహపురి వేదికగా నిలుస్తోంది. కమ్యూనిస్టు ఉద్యమ పునరుత్తేజానికి.. సింహనాదం పూరించడానికి ఎర్రసైన్యం సన్నద్ధమైంది.

¯ðlË*Ï-Æý‡$ÌZ fÇVóS 27Ð]l Æ>çÙ‰ Ð]l$à-çÜ-¿ýæÌZ Æ>¯]l$¯]l² 3 HâýæÏ M>ÌS…ÌZ ´ëÈt {ç³×ê-ãMýSOò³ MîSÌSMýS °Æý‡~-Ķæ*-ÌSMýS$ M>Æ>Å^èlÆý‡×æ Æý‡*´÷…¨Ý뢅. {ç³gê ´ùÆ>sêË$, {糿¶æ$™èlÓ OÐðlçœÌêÅ-ÌS¯]l$ {ç³fÌS §ýl–ííÙŠ-ి-rP ¡çÜ$-MðS-ãÏ ÐéÇ° O^ðl™èl-¯]lÅ-Ð]l…-™èl$Ë$ ^ólĶæ$-yé-°MìS, ´ëÈt ºÌZõ³-™èl…, M>Æý‡ÅMýS-Æý‡¢-ÌSMýS$ ¿ýæÆøÝë MýSÍ-W…^ól {糆´ë-§ýl-¯]l-ÌSMýS$ {ç³×ê-ãMýSË$ ™èlĶæ*Æý‡$ ^ólÝ뢅.

– వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

నెల్లూరు ఎన్నో ప్రజాపోరాటాలకు, ఉద్యమాలకు పురిటిగడ్డ. పోరాట యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్య వంటి నేతల స్ఫూర్తితో సీపీఎం ప్రధాన భూమిక పోషించే విధంగా భవిష్యత్‌ కార్యాచరణకు నాంది పలకబోతున్నాం. ప్రజల పక్షాన నిలిచి ప్రజాపోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

– మూలం రమేష్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు 1
1/2

నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు

నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు 2
2/2

నేటి నుంచి సీపీఎం రాష్ట్ర మహాసభలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement