No Headline
ఫిషింగ్ హార్బర్‌లో బకింగ్‌హాం కెనాల్‌పై బ్రిడ్జి నిర్మించాల్సిన ప్రదేశం
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను అందుబాటులోకి తెచ్చే అంశంపై స్పష్టత కొరవడుతోంది. నెలల తరబడి జాప్యం జరుగుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో హార్బర్ పనులు ప్రారంభించి చాలా వరకు పూర్తిచేశారు. దాదాపు పూర్తయిన ఆ హార్బర్‌ను ప్రారంభించాల్సిన తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రధాని వర్చువల్‌గా దీన్ని ప్రారంభించి ఐదు నెలలు గడిచినా.. వినియోగంలోకి రాలేదు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై కూటమి సర్కార్ నిర్లక్ష్యం
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే
పూర్తయిన నిర్మాణం
ప్రధాని వర్చవల్‌గా ప్రారంభించి
ఐదు నెలలు అయినా..
వినియోగంలోకి రాని వైనం
మరో వైపు సముద్రంలో పెద్దబోట్లతో మత్స్య సంపదను దోచుకెళ్తున్న
తమిళ జాలర్లు
వేట సాగక.. పూట గడవని దుస్థితిలో మత్స్యకారులు
ఇదీ... తాజా పరిస్థితి
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఫిషింగ్ హార్బర్ పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలు తర్వాత అంటే 2 ఆగస్టు 2024న ఫిషింగ్ హార్బర్‌ను జిల్లాకు చెందిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. ఆరు నెలల్లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి చేస్తామని మంత్రి ఆనం ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోదీ 30 ఆగస్టు 2024న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
10.12.2024న కలెక్టర్ అధ్యక్షతన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ జిల్లా స్థాయి సలహా కమిటీ (డిస్రిక్ట్ లెవల్ అడ్వైజరీ కమిటీ) ప్రథమ సమావేశం జరిగింది. దీనిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తూ వివిధ భాగస్వాముల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించుకుంటూ, హార్బర్ నిర్వహణ, వివిధ రుసుముల (ఫీజులు) వసూలు తదితర అంశాలు చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment