వైఎస్సార్‌సీపీ నేతపై పచ్చమూకల దాడి
కొడవలూరు: మండలంలోని నార్తురాజుపాళెంలో వైఎస్సార్‌సీపీ నేత కొడవలూరు మోహన్‌రావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు శుక్రవారం దాడిచేసి గాయపరిచారు. మోహన్‌రావు పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని తెలుగు తమ్ముళ్లు అక్కసు పెంచుకున్నారు. ఆయన యల్లాయపాళెంలో ఉన్న పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా పచ్చమూకలు దాడికి తెగబడ్డాయి. వృద్ధుడైన తనపై కక్షలేమిటని బతిమిలాడినా వినకుండా ముష్టిఘాతాలు కురిపించారు. దీంతో కుడిచేతి చూపుడు వేలు విరిగింది. గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు 108 అంబులెన్స్‌లో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నార్తురాజుపాళేనికి చెందిన టీడీపీ నాయకుడు మందిపాటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, యల్లాయపాళేనికి చెందిన నేత గరికపాటి రాజేంద్ర, మయూరి సిద్ధార్థ ఇంకొంత మంది దాడికి పాల్పడ్డారని మో హన్‌రావు తెలిపారు. ఆయన్ను మాజీ ఎమ్మె ల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment