● ఆర్టీసీ బస్సు టైర్ కింద నలిగిన ప్రాణం
నెల్లూరు(క్రైమ్): ఆర్టీసీ డ్రైవర్ బస్సును ముందుకు కదల్చడంతో ఓ విద్యార్థి అదుపుతప్పి టైర్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నెల్లూరు నార్త్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. కొడవలూరు మండలం రేగడిచెలికకు చెందిన మహీంధర్ (18) నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీ డియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గురువారం సాయంత్రం అతను కళాశాల నుంచి ఇంటికెళ్లేందుకు ఆత్మకూరు బస్టాండ్‌లో బస్సు ఎక్కా డు. అది మినీలారీ స్టాండ్ వద్దకు వచ్చేసరికి కొందరు ఆపారు. ఈ క్రమంలో మహీంధర్ కిందకు ది గాడు. ప్రయాణికులు ఎక్కారు. అనంతరం మహీంధర్ ఎక్కుతుండగా డ్రైవర్ ముందుకు కదల్చడంతో అదుపుతప్పి బస్సు వెనుక టైరు కింద పడ్డాడు. తలకు తీవ్రగాయాలైన మహీంధర్‌ను స్నేహితుడు కిశోర్ ఆటోలో చికిత్స నిమిత్తం నారాయణ ఆస్పత్రికి తరలించి బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి విద్యార్థి మృతిచెందాడు. మృతుడి తండ్రి మస్తానయ్య నార్త్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబానికి అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment