ఉత్సాహంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
కొడవలూరు: మండలంలోని గండవరం ఉదయకళేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు జరిగాయి. ప్రొద్దుటూరుకు చెందిన డి.గురవారెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కె.రమేష్ యాదవ్‌ల ఎడ్ల జత సంయుక్తంగా విజేతగా నిలిచాయి. వాటికి రూ.లక్ష బహుమతి అందజేశారు. మైదుకూరుకు చెందిన కుర్ర వెంకటేష్ యాదవ్ ఎడ్ల జత రెండో స్థానంలో నిలిచి రూ.75 వేలు అందుకున్నాయి. పల్నాడు జిల్లాకు చెందిన సాయిగణేష్‌శర్మ, కటకం లక్ష్మణ్‌కు చెందిన ఎడ్ల జత మూడో బహుమతి రూ.50 వేలు గెలుచుకున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన ఎం.సుబ్బారెడ్డికి చెందిన ఎడ్ల జత నాలుగో స్థానంలో నిలిచి రూ.30 వేలు అందుకున్నాయి. బాపట్లకు చెందిన వీరాస్వామి ఎడ్ల జత ఐదో బహుమతి రూ.20 వేలు కై వసం చేసుకుంది. పోటీల్లో మరో నాలుగు ఎడ్ల జతలు పాల్గొనగా వారికి రూ.10 వేల వంతున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విజేతలకు నిర్వాహకులు, పౌరసరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి బహుమతుల ప్రదానం చేసి మాట్లాడారు. ఇక్కడ తొలిసారిగా పోటీలు జరగ్గా తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఎండ తీవ్రతను లెక్క చేయలేదు. పోటీలను ఆలయ బ్రహ్మోత్సవ కమిటీ చైర్మన్ ఆలం మాలకొండయ్య పర్యవేక్షించారు. పోటీలకు వినియోగించిన 2,100 కిలోల బండను చుండి వెంకటరెడ్డి జ్ఞాపకార్ధం కుమారుడు అమర్‌నాఽథ్‌రెడ్డి ఇచ్చారు. కొడవలూరు సీఐ ఎ.సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డిలు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో విజయభాస్కర్‌రెడ్డి, పెనాక వెంకటేశ్వర్లురెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, బచ్చు సురేష్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి విజేతగా ప్రొద్దుటూరు
తిలకించేందుకు భారీగా వచ్చిన జనం
Comments
Please login to add a commentAdd a comment