బిట్రగుంట: బోగోలు మండలం ముంగమూరు గ్రామంలో బుధవారం ట్రక్ ఆటోను మోటార్‌బైక్ ఢీకొన్న ఘటనలో యాదగిరి శ్రీను (17) అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం మేరకు.. కావలి రూరల్ మండలం గౌరవరం గిరిజన కాలనీకి చెందిన శ్రీను, గణేష్‌లు ముంగమూరు గ్రామంలో పొలంలో పురుగు మందులు పిచికారీ చేసే పని చేసి తిరిగి బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ముంగమూరు గ్రామంలో మినరల్ వాటర్ అమ్మకాలు చేసే ట్రక్ ఆటోను బైక్ ఢీకొట్టింది. దీంతో శ్రీను మరణించగా, గణేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కావలి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment