గర్భిణిపై టీడీపీ నేత అమానుషం
బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని చెల్లాయపాళెంలో నిండు గర్భిణిపై తన సొంత పెదనాన్న, టీడీపీ నేత అమానుషంగా దాడి చేసిన ఘటన బుధవారం జరిగింది. ఆ గర్భిణి బాధతో విలవిలలాడుతూ పోలీసులకు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తన భర్త సహకారంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అర్ధ గంటసేపు బాధతో విలవిలలాడుతూ కూర్చున్నా.. పోలీసులు పట్టించుకోకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. చెల్లాయపాళెంకు చెందిన టీడీపీ నేత తమ్మిరెడ్డి మల్లికార్జున్ సోదరుడు చనిపోవడంతో అతని భార్య, బిడ్డలతో పొలం వివాదం ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం తమ్ముడి భార్య, రెండో కుమార్తెతోపాటు మరికొందరిపై దౌర్జన్యం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన పుట్టింట్లో ఉన్న తమ్మిరెడ్డి శరణ్య బుధవారం మందులు తెచ్చుకునేందుకు బుచ్చిరెడ్డిపాళెం బయలుదేరింది. ఆమెను చూసిన పెదనాన్న మల్లికార్జున్, నానమ్మ అడ్డగించారు. శరణ్య నిండు గర్భిణి అని తెలిసి కూడా ఆమె కడుపుపై విచక్షణా రహితంగా కాళ్లతో తన్నుతూ, కర్రలతో కొట్టారు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసినా స్పందించలేదు. శరణ్య బాధతో రోదించి పోలీస్‌స్టేషన్ వద్దే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమె భర్త హరికిరణ్ స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పుడొచ్చిన పోలీసులు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు ప్రయత్నించగా తాము చికిత్స పొందుతున్న వైద్యశాలకు వెళ్తామని శరణ్య, ఆమె భర్త చెప్పడంతో అక్కడికి తరలించారు. టీడీపీ నేతల దురాగతానికి, మహిళపై దాడి చేసినా తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అంశాలు దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment