
అండగా ఉంటాం : పర్వతరెడ్డి
వెంకటాచలం: మండలంలోని చెముడుగుంటలో సెంట్రల్ జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎ.శ్రీధర్‌రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గురువారం ములాఖత్ ద్వారా కలిశారు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీధర్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు మోపడంతో జైల్లో ఉన్నాడు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి అతడి ఆరోగ్య విషయాలు తెలుసుకుని, అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పశుగణన గడువు
పొడిగింపు
నెల్లూరు(సెంట్రల్): పశుగణన గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించినట్లుగా జిల్లా పశుగణన నోడల్ అధికారి మంజునాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదట ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చారన్నారు. అయితే పలు ప్రాంతాల్లో ఇంకా గణన చేయాల్సి ఉందన్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు వచ్చినప్పుడు పాడి రైతులు సహకరించాలని సూచించారు.
ఆటోను ఢీకొన్న కారు
నాయుడుపేట టౌన్: స్వర్ణముఖి నది కాజ్‌వే వద్ద గురువారం కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. పోలీసుల కథనం మేరకు.. మాచవరం గ్రామానికి చెందిన రవివర్మ ఆటోలో నాయుడుపేటకు వచ్చి తిరిగి స్వగ్రామానికి స్నేహితుడితో కలిసి బయలుదేరాడు. స్వర్ణముఖి నది కాజ్‌వే వద్ద వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో ఆటో కాజ్‌వే పైనుంచి స్వర్ణముఖి నదిలోకి బోల్తా పడింది. రవివర్మ గాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment