
ధాన్యానికి రేట్లు లేవు
రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా మిల్లర్లు సిండికేట్‌గా మారి మోసం చేస్తున్నారు. వారు తయారు చేసే బియ్యానికి మాత్రం రేట్లు తగ్గించకుండా విక్రయిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే రైతు పండించిన ధాన్యానికి రేట్లు లేకుండా చేసి పబ్లిక్ మార్కెట్లోనేమో బియ్యం కొనుగోలు చేసే వినియోగదారులకు రేట్లు పెంచడమే కాకుండా తూకాల్లో కూడా ఒకటి రెండు కేజీలు తగ్గించి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
– గాలి మల్లికార్జున్‌రెడ్డి,
సుగ్గుపల్లి, సూళ్లూరుపేట మండలం
Comments
Please login to add a commentAdd a comment