నెల్లూరు(క్రైమ్): నెల్లూరు రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలోని గుడి వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు బాలాజీ నగర్ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుడి పక్కనే ఉన్న సంచిలో బేల్దారి పనిముట్లను గుర్తించారు. వయసు 60 ఉంటుందని భావిస్తున్నారు. వృద్ధుడు ఉదయం 7 గంటల నుంచి ముత్తుకూరు బస్టాండ్ వద్ద ఆటోలు ఆపుతుండగా మద్యం తాగి ఉన్నాడని ఎవరూ స్పందించలేదని స్థానికులు తెలిపారు. దీంతో మద్యం మత్తులో ఊపిరాడకో లేదా అనారోగ్యంతో మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బాలాజీ నగర్ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment