నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు పముజుల హరి ఆరోపించారు. నగరంలోని తన కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. చేనేత రంగానికి బడ్జెట్లో రూ.138 కోట్లను కేటాయించడం దారుణమని, ఇందులో రూ.ఐదు కోట్లే చేనేత సహకార సంఘాలకు ఉపయోగపడతాయని, మిగిలిన మొత్తం అలంకారప్రాయంగా మారనుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అందజేసిన నేతన్న నేస్తం కంటే మెరుగైన పథకాలను ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment