సాయిబాబా ఆలయంలో పట్టపగలే చోరీ
ఉరవకొండ: స్ధానిక షిర్డి సాయిబాబా ఆలయంలో పట్టపగలే చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు... ఈ నెల 19న మాలాధారణ భక్తుడిగా ఆలయానికి వెళ్లిన ఓ దుండగుడు సాయిబాబా పంచలోహ విగ్రహంతో పాటు పెద్ద ఎత్తున వెండి సామగ్రి అపహరించుకెళ్లాడు. ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడం గమనార్హం. మూలవిరాట్ వద్ద ఉంచిన బాబా పంచలోహ విగ్రహం, వెండి సామగ్రి, గంటను ఒక బ్యాగ్లో పెట్టుకోని తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. బుధవారం దుయం ఆలయంలో విలువైన వెండి సామగ్రితో పాటు స్వామి పంచలోహ విగ్రహం లేకపోవడంతో సీసీ కెమెరా ఫుటేజీలను ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు. దీంతో చోరీ విషయం వెలుగు చూసింది. ఘటనపై పోలీసులకు ఆలయ కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ప్రశాంతంగా మునిసిపల్ హెచ్ఎం పదోన్నతులు
అనంతపురం ఎడ్యుకేషన్: నగరపాలక సంస్థ, మునిసిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ బుధవారం ప్రశాంతంగా జరిగింది. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో మూడు గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు, ఉమ్మడి జిల్లాలోని మునిసిపాలిటీ స్కూళ్లలోని మూడు గ్రేడ్–హెచ్ఎం పోస్టులకు పదోన్నతులు జరిగాయి. డీఈఓ కార్యాలయంలో ఉదయం సర్టిపికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి మధ్యాహ్నం కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా పోస్టులను భర్తీ చేశారు. 1:3 చొప్పున కౌన్సెలింగ్కు పిలవగా...అనంతపురం కార్పొరేషన్లో మొదటి అభ్యర్థి నాట్ విల్లింగ్ ఇచ్చారు. తక్కిన వరుసగా ముగ్గురూ పదోన్నతులు తీసుకున్నారు. అదే మునిసిపాలిటీలకు వచ్చేసరికి మూడు పోస్టులకు 9 మంది అభ్యర్థులను పిలవగా ఇద్దరు విల్లింగ్ ఇచ్చి..తక్కిన ఏడుమంది నాట్ విల్లింగ్ ఇచ్చారు. దీంతో సీనియార్టీ జాబితాలో 13వ స్థానంలో ఉన్న టీచరు ఫోన్ ద్వారా విల్లింగ్ ఇవ్వడంతో ఆయనను గురువారం కార్యాలయానికి రావాలని సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment