అరటి ఎగుమతులు.. లేని గొప్పలు! | - | Sakshi
Sakshi News home page

అరటి ఎగుమతులు.. లేని గొప్పలు!

Published Mon, Jan 27 2025 6:39 AM | Last Updated on Mon, Jan 27 2025 6:39 AM

అరటి

అరటి ఎగుమతులు.. లేని గొప్పలు!

అనంతపురం అగ్రికల్చర్‌: 2004–2009 మధ్య కాలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహంతో అనంతపురం జిల్లా ‘ఫ్రూట్‌ బౌల్‌ ఏపీ’గా ఖ్యాతి పొందింది. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2019–2024 మధ్యకాలంలో పండ్లతోటల రైతులను మరింత ప్రోత్సహించడంతో ఉద్యానహబ్‌ దిశగా అడుగులు పడ్డాయి. చీనీ, అరటి, మామిడి, దానిమ్మ, టమాట, పూలు లాంటి ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ కల్పించే దిశగా ఎగుమతులకు శ్రీకారం చుట్టారు. దేశంలో మరెక్కడా లేని విధంగా జిల్లా నుంచి అరబ్‌ దేశాలకు అరటి ఎగుమతులకు 2019 జనవరి 30న పుట్లూరు మండలం కడవకల్లు వేదికగా నాంది పలికారు. తాడిపత్రి రైల్వేస్టేషన్‌ నుంచి నేరుగా ముంబై పోర్టు, అక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు ‘హ్యాపీ బనానా’ పేరుతో నాణ్యమైన అరటిని ఎగుమతి చేశారు.

అరటికి నిలయం..

అనంతపురం జిల్లా అరటి తోటలకు నిలయంగా మారుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12,250 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో అరటి సాగవుతోంది. నార్పల, పుట్లూరు, యల్లనూరు, బెళుగుప్ప, యాడికి, పెద్దపప్పూరు, తాడిపత్రి, తాడిమర్రి, కనగానపల్లి మండలాల్లో ఎక్కువగానూ, రాప్తాడు, అనంతపురం, శింగనమల, ఉరవకొండ, కూడేరు, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, బత్తలపల్లి, ధర్మవరం తదితర మండలాల్లో కొంత వరకు అరటి తోటలు విస్తరించాయి. 95 శాతం గ్రాండ్‌–9 రకం కాగా కొంత యాలక్కీ రకం కూడా సాగు చేస్తున్నారు. జిల్లా అరటికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ పరంగా డిమాండ్‌ నెలకొంది. 65 శాతం వరకు ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా...తెలంగాణ, కర్ణాటక, ఏపీ ప్రాంతాల్లో మిగతాది మార్కెటింగ్‌ చేస్తున్నారు. నాణ్యత విషయంలో ఈక్వెడార్‌, పెరుు, ఫిలిప్పీన్స్‌, హొండూరస్‌ లాంటి కొన్ని దేశాల సరసన నిలుస్తుండటం విశేషం.

గత ప్రభుత్వ హయాంలోనే

జిల్లా అరటికి అంతర్జాతీయ ఖ్యాతి

‘హ్యాపీ బనానా’ పేరుతో

అరబ్‌ దేశాలకు అరటి ఎగుమతులు

కూటమి ప్రభుత్వం వచ్చాక

ఇటీవల మరోసారి రవాణా

అయినా తామే తొలిసారి

ఎగుమతి చేసినట్లు డాంబికాలు

31న ‘అనంత’లో ‘హార్టికల్చర్‌ కాన్‌క్లేవ్‌’

31న అనంతలో హార్టికల్చర్‌ కాన్‌క్లేవ్‌..

గతంలో వైఎస్‌ జగన్‌ సర్కారు తీసుకున్న చర్యలు అరటి రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నదాతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 31న స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో ‘అనంత హార్టికల్చర్‌ కాన్‌క్లేవ్‌’ పేరుతో సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు, ఎగుమతిదారులు పాల్గొననున్నట్లు తెలిసింది. రెండు జిల్లాలతో పాటు వైఎస్సార్‌, అన్నమయ్య, కర్నూలు, చిత్తూరు తదితర అరటి పండించే జిల్లాల నుంచి రైతులు హాజరు కానున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెటింగ్‌ చేస్తున్న కొనుగోలు సంస్థలు, ఎగుమతి కంపెనీ ప్రతినిధులు దాదాపు 25 సంస్థల నుంచి ప్రతినిధులు హాజరై ఉత్పత్తిదారులు, ఉద్యానశాఖతో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా అరటికి మొదటి సారిగా ఉచిత పంటల బీమా పథకం అమలు చేసిన ఘనత కూడా వైఎస్‌ జగన్‌ సర్కారుకే దక్కుతుంది. అలా గత సర్కారు ఇచ్చిన ప్రోత్సాహకాలు, చర్యల కారణంగా అరటి సాగు విస్తీర్ణం పెరిగింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మాదిరిగానే ఇటీవల అరబ్‌ దేశాలకు అరటి ఉత్పత్తులను ఎగుమతి చేశారు. అయితే, గతం మరిచి కూటమి ప్రభుత్వంలోనే తొలిసారి అరటి ఎగుమతులు ప్రారంభించినట్లు ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం గొప్పలు చెప్పుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
అరటి ఎగుమతులు.. లేని గొప్పలు! 1
1/2

అరటి ఎగుమతులు.. లేని గొప్పలు!

అరటి ఎగుమతులు.. లేని గొప్పలు! 2
2/2

అరటి ఎగుమతులు.. లేని గొప్పలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement