ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు

Published Thu, May 9 2024 4:15 AM

ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎన్నికలు పూర్తయ్యాక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు తీసుకు వచ్చే వాహనాలకు ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జీఆర్‌ రాధిక తెలిపారు. ఈవీఎంలు స్వీకరించే రిసెప్షన్‌ కేంద్రాల ఏర్పాటును చిలకపాలేం శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో బుధవారం పరిశీలించారు. ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు ఇక్కడకు తరలించి స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపర్చనున్నట్లు చెప్పారు. ఒకే సారి వాహనాలు వచ్చినా ట్రాఫిక్‌ సమస్య లేకుండా ఎప్పటి వాహనాలు అప్పుడు అన్‌లోడ్‌ చేసి స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించనున్నట్లు తెలిపారు. రిసెప్షన్‌ కేంద్రాల ఏర్పా ట్లు, సమీప లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన రోడ్లు, పార్కింగ్‌ స్థలం పరిశీలించారు. ఆమె వెంట అద నపు ఎస్పీ ప్రేమ్‌కాజల్‌, సీఐలు జి.రామచంద్రరావు, ఎం.అవతారం, ఎస్‌ఐ చిరంజీవి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement