కడుతున్నారో.. కూల్చేస్తున్నారో..?
4
వ
సారి
మళ్లీ నిర్మాణం మొదలుపెట్టారు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
రథసప్తమి వేడుకల పేరుతో నగరంలో జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనుల్లో గందరగోళం చోటు చేసుకుంటోంది. ఎందుకు కడుతున్నారో.. ఎందుకు కూల్చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. స్థానిక మిల్లు జంక్షన్ వద్ద జరుగుతున్న కట్టడాలు, కూల్చివేతలు చూసి ప్రజలే తిడుతున్నారు. పాలకొండ రోడ్డులో జరుగుతున్న సెంట్రల్ డివైడర్ పనులు, మిల్లు జంక్షన్ వద్ద జరుగుతున్న ఫౌంటెయిన్ పనులు ప్రతి ఒక్కరినీ అయోమయానికి గురి చేస్తున్నాయి. మిల్లు జంక్షన్ వద్ద జరుగుతున్న ఫౌంటెయిన్ పనులను తీసుకుంటే.. బాబూ జగ్జీవన్‌రావు విగ్రహం వద్ద బ్యూటిఫికేషన్‌లో భాగంగా ఫౌంటెయిన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలుత 12 అడుగులతో నిర్మించాలని పనులు చేపట్టారు. ఫౌంటెయిన్ నిర్మాణం పూర్తయ్యాక కాదు కాదు.. 10 అడుగులకే అని నిర్మించిన దాంట్లో కొంత భాగాన్ని కూల్చేశారు. కూల్చేయగా మిగిలిన ఫౌంటెయిన్ నిర్మాణం పనిని తర్వాత పూర్తి చేశారు. మళ్లీ ఏమైందో పూర్తిగా నిర్మించిన ఫౌంటెయిన్ మళ్లీ నేలమట్టం చేశారు. అప్పటికే నిర్మించిన ఐరన్, సిమెంట్ మెటీరియల్ తదితర అవశేషాలు కనబడకుండా రాత్రికి రాత్రి పూర్తిగా కూల్చేశారు. దీంతో అటుగా వచ్చిన ప్రజలే కాదు కలెక్టరేట్‌కు వెళ్లే అఽధికారులు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ నాయకులకు, అధికారులకు ఏం తట్టిందో తెలియదు గాని కూల్చిన చోటే మళ్లీ మరో కట్టడాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా)కు చెందిన రూ.40లక్షలతో చేపడుతున్న పనులన్నీ దుర్వినియోగమవుతున్నాయి. ఇదంతా చూసి ఈ ప్రభుత్వానికి ఏమైందో, ఎవరి కోసం ఈ పనులు చేస్తున్నారో, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం తప్ప నగరానికి ఒరిగిందేంటని ప్రశ్నిస్తున్నారు.
● కట్టడం.. కూల్చడం.. కట్టడం
● మిల్లు జంక్షన్‌లో జరుగుతున్న
పనుల్లో అయోమయం
● రూ. 40లక్షలతో చేపడుతున్న బ్యూటిఫికేషన్ పనుల్లో గందరగోళం
● ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై
అంతటా విస్మయం
ఎందుకు
Comments
Please login to add a commentAdd a comment