తెలుగు తమ్ముళ్ల చేతివాటం
ఘరానా మోసం
ఈ స్క్రీన్ షాట్ చూడండి. తెలుగుదేశం పార్టీ అకౌంట్‌కు రూ. లక్ష జమ అయినట్టు చూపిస్తోంది. స్థానిక టీడీపీ నాయకులు ఒత్తిడి మేరకు ఆమె తమ సభ్యత్వం కింద రూ.100 ఇవ్వగా, తమకు క్యాష్ వద్దని స్కానర్ ద్వారా చెల్లించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. దీంతో వాళ్లే స్కానర్ ఓపెన్ చేసి, రూ.100 బదులు రూ.లక్ష ఫీడ్ చేసి, పాస్వర్డ్ నొక్కమని లక్ష్మీనాయక్‌కు ఇచ్చారు. మోసం గుర్తించకుండా ఆమె పాస్వర్డ్ కొట్టేశారు. రూ.100 చెల్లించానని ఆమె అనుకున్నారు. కానీ, కాసేపటికి ఆమె అకౌంట్ నుంచి రూ.లక్ష విత్‌డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. జరిగిన విషయాన్ని వెంటనే తన భర్త సురేష్ నాయక్‌కు తెలియజేసింది. వెంటనే అప్రమత్తమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ తీశారు. అందులో తెలుగుదేశం పార్టీ అకౌంట్‌కు రూ.లక్ష జమ అయినట్టు రికార్డయ్యి ఉంది. దీంతో ఆమె లబోదిబోమంటూ తన వద్దకు వచ్చిన టీడీపీ నాయకుల్ని కలిసి నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment