●ఇన్సూరెన్సు తప్పనిసరి..
ఎక్కువ ప్రమాదాలు హెల్మెట్లు లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. కొందరు హెల్మెట్ ధరించినా క్లిప్ పెట్టరు. బీ1ఎస్ స్టాండర్డ్ హెల్మెట్లు సురక్షితం. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ మీరుతూ ప్రమాదాలు చేసేవారిపై జరిమానా విధిస్తూనే మూడు నెలలపాటు లైసెన్సు రద్దు చేస్తున్నాం. మళ్లీ మళ్లీ చేస్తే శాశ్వత రద్దే. సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ (ఆపోజిట్) డైరెక్షన్స్‌లో వెళ్తూ కంట్రోల్ చేయలేకపోవడం, అతివేగం ఘోర ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇన్సూరెన్సు తప్పనిసరి.
– ఎ.విజయసారధి, జిల్లా ఉపరవాణా శాఖాధికారి (డీటీసీ), శ్రీకాకుళం
●జిల్లాకేంద్రంలో ఎన్నో మార్పులు..
ట్రాఫిక్ దృష్ట్యా ఎన్నో మార్పులు చేశాం. క్రౌడ్ ఏరియాలు, కూడళ్లలో కొందరి సౌజన్యంతో 150కు పైగా స్టాపర్స్ పెట్టాం. ప్రైవేట్ ట్రావెల్స్‌ను కొత్తరోడ్డు వెంబడి, ఆటోలను రిమ్స్ నుంచి అంబేడ్కర్ కూడలి మీదుగా మళ్లించి ట్రాఫిక్‌ను నిలువరించాం. ట్రాఫిక్ వారితో పాటు అవసరాన్ని బట్టి లాఅండ్ఆర్డర్ పోలీసులను, హోంగార్డులను సైతం వినియోగిస్తున్నాం. రథసప్తమి పురస్కరించుకుని మరింత పకడ్బందీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.
– సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment