రణస్థలం బంద్ విజయవంతం
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురంలో జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ పనులను వ్యాపారులు, గ్రామస్తులతో చర్చించకుండా సర్వేలు చేయడాన్ని నిరసిస్తూ గురువారం చేపట్టిన రణస్థలం బంద్ విజయవంతమైంది. ఫ్లై ఓవర్ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు, వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. అనంతరం సర్వీస్ రోడ్డులో భారీ ర్యాలీగా వెళ్లి రణస్థలం తహసీల్దార్ ఎన్.ప్రసాదరావుకు వినతి పత్రం అందజేశారు. బంద్‌కు గల కారణాలు వివరించి, హైవే అధికారులతో ప్రజా ప్రతినిధుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ స్పందిస్తూ త్వరలోనే హైవే, ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
సంఘీభావం తెలిపిన కిరణ్..
ఫ్లై ఓవర్ నిర్మాణంపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో హైవే అధికారులతో మాట్లాడి యు.బి. పరిశ్రమ నుంచి రావివలస వరకు ఓపెన్ పిల్లర్లతో కూడిన ఫ్లై ఓవర్ నిర్మిస్తామని చెప్పినట్లు ఎచ్చెర్ల మాజీ ఎమ్మె ల్యే గొర్లె కిరణ్‌కుమార్ గుర్తు చేశారు. ప్రస్తుతం కొలతల్లో వ్యత్యాసాలు ఉండటం ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment