ఆ గంటే.. కీలకమంట
శ్రీకాకుళం క్రైమ్ : గోల్డెన్ అవర్.. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు సంభవించేటప్పుడు మాత్రమే ఈ పదం వినుంటారు. ప్రమాదాలు సంభవించిన గంటలోపే క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చడం దీని ఉద్దేశం. ఇదే తరహాలో సైబర్ మోసాలకు గురయ్యే బాధితులు సైతం నేరం జరిగిన గంటలోగా ఫిర్యా దు చేయగలిగితే.. మన ఖాతాలో పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకునే వీలుంటుంది. బాధితులు చేయాల్సిందల్లా గోల్డెన్ అవర్‌లో సైబర్‌సెల్‌కు ఫిర్యాదు చేయడమే. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇచ్చిన నివేదిక ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు ఐదువేలలోపు సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదులు వెళ్లాయి. తాము మోసానికి గురవుతున్న నిమిషాల్లోనే ఎన్‌సీఆర్బీకి, 1930 సైబర్ సెల్ నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు ఇవ్వడం వలన సుమారు రూ. 4.09 కోట్ల వరకు సేవ్ అయినట్లు ఈ నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో తొలిసారిగా ఐదు సైబర్ కేసులకు సంబంధించి రూ. 10.13 లక్షలు బాధితులకు అందించిన ట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఇటీవల వెల్లడించారు.
ఫిర్యాదు చేయాలిలా..
● మనం మోసపోయిన క్షణానే 1930 నంబర్‌కు కాల్ చేయాలి.
● లేదంటే హెచ్‌టీటీపీఎస్://ిసీవైబీఇఆర్‌ిసీఆర్‌ఐఎంఇ.జిఒవి.ఐఎన్ అనే పోర్టల్‌ను క్లిక్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి ఫైల్ ఎ కంప్లైంట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని నియమాలు షరతులు చూపిస్తుంది. వాటిని చదివి యాక్సెప్ట్ చేసి రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
● తర్వాత సిటిజన్ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ వివరాలు ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
● ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్‌ను బాక్స్‌లో ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. తర్వాత పేజీలోకి తీసుకెళ్తుంది. అసలు ప్రక్రియ మొదలయ్యేది ఇక్కడే.
● ఈ పేజీలో ఒక ఫారం కనిపిస్తుంది.. దానిలో మనకు జరిగిన సైబర్ మోసం గురించి రాయాలి. కాకపోతే నాలుగు సెక్షన్లుగా విభజించి ఉంటుంది. సాధారణ సమాచారం (విక్టిమ్ ఇన్ఫర్మేషన్), సైబర్ నేరానికి సంబంధించి సమాచారం (సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్), ప్రివ్యూ అనే సెక్షన్లు ఉంటాయి.
● ప్రతి సెక్షన్‌లో అడిగిన వివరాలను సమర్పిస్తూ.. ప్రక్రియను పూర్తిచేయాలి. మూడు సెక్షన్లు పూర్తయ్యాక ప్రివ్యూను వెరిఫై చేయాలి. అన్ని వివ రాలు సరిగా ఉన్నాయమని భావిస్తే
గోల్డెన్ అవర్‌లో కంప్లైంట్‌తో మేలు
సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్‌కు కాల్ చేయాలి.
సైబర్
అలెర్ట్
సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు
ఆ సమయమే ప్రధానం
Comments
Please login to add a commentAdd a comment