94.72%
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్
శ్రీకాకుళం:
ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో గురువారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. జిల్లాలో 5,035 మంది ఓటర్లు కాగా 4,769 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 94.72 శాతం పోలింగ్ జరిగింది. 5,035 మంది ఓటర్లలో 3,416 మంది పురుషులు కాగా వీరిలో 3,247 ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,619 మంది మహిళల్లో 1,522 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 2878 మంది ఓటర్లకు గాను 2700 మంది, టెక్కలి డివిజన్‌లో 1053 మందికి గాను 1008 మంది, పలాస డివిజన్‌లో 1104 మందికి గాను 1061 మంది ఓటు వేశారు. శ్రీకాకుళం డివిజన్‌లో 1838 మంది పురుషుల్లో 1734 మంది, 1040 మంది మహిళల్లో 966 మంది ఓటు వేశారు. టెక్కలి డివిజన్‌లో 780 మంది పురుషుల్లో 750 మంది, 273 మంది మహిళల్లో 258 మంది ఓటు వేశారు. పలాస డివిజన్‌లో 792 మంది పురుషుల్లో 763 మంది, 312 మంది మహిళల్లో 298 మంది ఓటు వేశారు. మండలాలు, మున్సిపాలిటీల్లో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల ను పరిశీలించారు. సిబ్బంది, ఓటర్లతో మాట్లాడి పోలింగ్ సరళి, సౌకర్యాలు కోసం తెలుసుకున్నారు. కూ టమి ప్రజా ప్రతినిధులు, నాయకులు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చేశారు. కొందరు ప్రజా ప్రతినిధులు గంటల తరబడి శిబిరాల్లో కాపు కాశా రు. ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసింది.
ఓటు హక్కు వినియోగించుకుంటూ..
ఓటు హక్కును వినియోగించుకుని వస్తున్న దివ్యాంగ టీచర్
31 కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్
ఓటుహక్కును వినియోగించుకున్న 4,769మంది ఉపాధ్యాయులు
94.72%
94.72%
94.72%
94.72%
94.72%
94.72%
94.72%
Comments
Please login to add a commentAdd a comment