● రెప్పపాటు ప్రమాదాలు..
శివరాత్రి మరునాడు జిల్లాలో రెండు రెప్పపాటు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పాలకొండ నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు పొందూరు మండలంలోని రెడ్డిపేటకు చేరుకునే సరికి డ్రైవర్ కాస్త రెప్ప వాల్చడంతో చెట్టును ఢీకొట్టింది. బస్సు ముందు అద్దాలు పగిలిపోయాయి. తొమ్మిది మందికి గాయాలు కాగా..పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరో ప్రమాదంలో మాత్రం మృత్యుదేవత కరుణించలేదు. శ్రీకాకుళానికి చెందిన దంపతులు బైక్‌పై దైవ దర్శనాలకువెళ్లి వస్తుండగా ఎచ్చెర్ల బైపాస్ రోడ్డు వద్ద అంబులెన్స్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనకు కారణం కూడా అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తేనని సమాచారం. ఈ బండి హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తోంది. – పొందూరు/ఎచ్చెర్ల క్యాంపస్
Comments
Please login to add a commentAdd a comment