శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Published Sun, Mar 2 2025 1:53 AM | Last Updated on Sun, Mar 2 2025 1:53 AM

శ్రీక

శ్రీకాకుళం

డ్రైవర్‌ గారూ.. తగ్గాలి జోరురాజాం–చిలకపాలెం రూట్‌లో బస్సులు యమస్పీడుగా వెళ్తున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. –8లో
ఆలివ్‌ రిడ్లే..

ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025

సముద్రంలోకి వెళ్తున్న తాబేలు పిల్లలు

15 నుంచి ఒంటి పూట బడులు

శ్రీకాకుళం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 15వ తేదీ నుంచి ఒంటి పూట తరగతులు నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, మోడల్‌ స్కూల్స్‌, ఎయిడెడ్‌, ప్రైవే టు, గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల మెనేజ్‌మెంట్‌లో ఒంటి పూట తరగతులు పక్కాగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ఎంఈఓలు, పాఠశాలల హెచ్‌ఎంలకు ఉత్తర్వులు వెళ్లాయి. అయితే ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున మార్చి మొదటి వారం నుంచే ఒంటి పూట తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు. పని వేళల్లో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు తరగతులు నిర్వహించేలా ఉత్తర్వులు విడుదల చేయాలని ఉపాధ్యాయలు కోరుతున్నారు. మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలల్లో సాయంత్రం ఒంటి పూట తరగతులు నిర్వహించాలని సూచించారు.

సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ ఐదు, ఏడు, బీపీఈడీ మూడో సెమిస్టర్‌ ఫలితాలు శనివారం పీజీ ఎగ్జామినేషన్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ శనివారం విడుదల చేశారు. ఐదో సెమిస్టర్‌లో సీఎస్‌ఈలో 63 మందికి 46, ఈసీఈలో 68 మందికి 49, మెకానికల్‌లో 60 మందికి 45, సివిల్‌లో 36 మందికి 29 మంది, ఏడో సెమి స్టర్‌లో సీఎస్‌ఈలో 71 మందికి 62, ఈసీఈలో 63 మందికి 57, మెకానికల్‌లో 59 మందికి 59 మంది ఉత్తీర్ణత సాధించారు. బీపీఈడీలో మూడో సెమిస్టర్‌లో 280 మందికి 274 మంది, డీపీఈడీలో 46 మందికి 6 మంది ఉత్తీర్ణత సాధించారు. 15 రోజుల్లోగా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఎస్‌ఐ చొరవ..

ఇంటర్‌ విద్యార్థులకు ఊరట

జి.సిగడాం: రాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారి దవళపేట గ్రామం వద్ద చీకటిలో భారీ ఊక లారీ మట్టిలో కూరుకుపోవడంతో శనివారం ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. పొందూరు నుంచి రాజాం, రాజాం నుంచి పొందూరు ఇంటర్‌ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇందులో ఇరుక్కుపోయారు. దీంతో స్థానిక ఎస్‌ఐ వై.మధుసూధనరావు, ఆర్‌అండ్‌బీ ఏఈఈ పీటీ రాజుతోపాటు ప్రత్యేక పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐ మా ట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ప్రత్యేక వాహనాల ద్వారా కేంద్రాలకు పంపించామని, మట్టిలో కూరుకుపోయిన లారీని యంత్రాల ద్వారా బయటకు తీసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించామన్నారు.

గుడ్లకు సంరక్షణ..

తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టి వెళ్లిపోయాక జిల్లాలో అటవీ శాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్‌ సౌజన్యంతో గుడ్లను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం మూడు డివిజన్ల పరిధిలో 16 సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇచ్ఛాపురం నియోజక వర్గంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలోని సోంపేట మండలం బట్టిగళ్లూరు, బారువ పేట, ఇస్కలపాలేం, కవిటి మండలం కళింగపట్నం, బట్టివాని పాలేం, సీహెచ్‌ కపాసుకుద్ది, ఇచ్ఛాపురం మండలం డొంకూరులో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం జిల్లాలో 1,59,403 గుడ్లు సేకరించి 1,44,981 పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ఎక్కువ పిల్లలను తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ డివిజన్‌ల పరిధిలో 452 నెట్లు ఏర్పాటు చేసి 53,400 గుడ్లు సేకరించారు. సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయంలో ఉంచి గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తర్వాత వాటిని సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెడతారు.

సాగర గర్భంలో తల్లులు, ఎక్కడో దూరంగా తీరంలో పిల్లలు.. ఆ తల్లీపిల్లలు కలుసుకోవడానికి సవాలక్ష ఆటంకాలు. ప్రకృతి వైపరీత్యాలు, జంతువుల దాడులు, ఆకతాయిల వికృత చేష్టలు అన్నీ తట్టుకుని నిలబడితేనే ఆ పిల్లలు కడలి గర్భంలోకి వెళ్లగలవు. లేదంటే అండంలో ఉన్నప్పుడే ఆయుష్షు తీరిపోతుంది. ఇలాంటి ఆపత్కాలంలో ఉన్న ఆలివ్‌ రిడ్లే తాబేలు పిల్లల ఆయుష్షుకు అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్‌ ప్రతినిధులు అండగా నిలబడుతున్నారు. తీరంలో గుడ్లను సంరక్షించి అవి పొదిగి పిల్లలు బయటకు వచ్చే వరకు జాగ్రత్తగా చూసి.. బుల్లి బుల్లి తాబేలు పిల్లలు

ఆనందంగా సముద్రంలోకి వెళ్లడాన్ని మురిపెంగా చూస్తున్నారు.

తాబేళ్లకు రక్షణగా ట్రీ ఫౌండేషన్‌, అటవీశాఖ

సాగర తీరంలో సంరక్షణ కేంద్రాలు

తాబేలు గుడ్లకు రక్షణ

పొదిగిన తర్వాత తీరంలోకి పిల్లలను వదిలిపెడుతున్న సభ్యులు

సోంపేట:

ముద్రంలో లక్షలాది జీవులు నివాసం ఉంటాయి. అందులో సముద్రానికి మేలు చేసే జాతుల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఒక జాతి. ఆ రకం తాబేళ్లు గుడ్లు పెట్టుకునేందుకు మన తీరాలను అనువుగా ఎంచుకున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత సముద్ర తీరానికి వచ్చి తీరంలో గొయ్యి తవ్వి గుడ్లు పెడతాయి. అనంతరం వాటిని కప్పేసి సముద్రంలోకి వెళ్లిపోతాయి. తీరంలో గుడ్లు పెట్టడానికి అనువైన స్థలం చూసుకుని గుడ్లు పెడుతుంటాయి. అలా వచ్చినప్పుడు బోట్లు తగిలి కొన్ని తాబేళ్లు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అంతరించి పోయే ప్రమాదంలో ఉండడంతో అటవీశాఖ పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది.

50 నుంచి 150 గుడ్లు

సాధారణంగా ఈ జాతి తాబేళ్లు 50 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంటాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపు తీరానికి చేరుకుని ఇసుకలో గోతులు తవ్వి వాటిలో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి తల్లి తాబేళ్లు సముద్రంలోకి వెళ్లిపోతాయి.

ప్రత్యేక జీవులు

ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు చాలా ప్రత్యేకమైనవి. వీటికి స్థిర నివాసం ఉండదు. రెండు అడుగుల పొడవు, సుమారు 150 కిలోలు పైన బరువు ఉండే తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం సుమారు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. డిసెంబర్‌ నుంచి మార్చి రెండో వారం వరకు ఎక్కువగా గుడ్లు పెడుతుంటాయి.

మత్స్యకారులు సహకరించాలి

తాబేలు గుడ్లను సంరక్షించడానికి అటవీ శాఖా ధికారులు, ట్రీ ఫౌండేషన్‌ ప్రతినిధులకు మత్స్యకారులు సహకరించాలి. అంతరించే స్థితి లో ఉన్న ఆలివ్‌రిడ్లే తాబేళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గుడ్లను సంరక్షించే బాధ్యత అటవీ శాఖ తీసుకుంటుంది. గత ఏడాది సుమారు లక్షా యాభై వేల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టాం. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.

– నాగరాజు, జిల్లా అటవీ శాఖాధికారి

గుడ్లను సంరక్షించడం ఆనందం

గత కొన్నేళ్లుగా అటవీ శాఖాధికారుల సౌజన్యంతో ట్రీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల గుడ్లు సేకరించి, వాటిని పిల్లలుగా తయారు చేసి సముద్రంలోకి విడిచి పెట్టడం ఆనందంగా ఉంది. జిల్లాలో మత్స్యకారులు సహాయ సహకారాలు అందించడంతో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది.

– కె.సోమేశ్వరరావు,

ట్రీ ఫౌండేషన్‌ జిల్లా కోఆర్డినేటర్‌

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
శ్రీకాకుళం1
1/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం3
3/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం4
4/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం5
5/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం6
6/7

శ్రీకాకుళం

శ్రీకాకుళం7
7/7

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement