
వాహనదారులకు జరిమానాల మోత
ఉల్లంఘన పాత కొత్త
జరిమానా జరిమానా
లైసెన్సు లేని వ్యక్తికి
వాహనం ఇస్తే రూ.1000 రూ. 5,000
లైసెన్సు లేకుండా వాహనం
నడిపితే రూ. 500 రూ. 5,000
మైనరు వాహనం
నడిపితే రూ. 500 రూ.10,000
అతివేగం(చిన్నవి) రూ. 400 రూ. 1000
(పెద్దవి) రూ. 500 రూ. 2,000
సీటుబెల్టు ధరించకపోతే రూ. 100 రూ. 1000
హెల్మెట్ ధరించకపోతే రూ. 100 రూ. 1000
శ్రీకాకుళం క్రైమ్ : సవరించిన మోటారు వాహన చట్టం ప్రకారం కొత్త అపరాధ రుసుం యాప్ జిల్లాలో అప్‌డేట్ అయ్యింది. శ్రీకాకుళం నగర పరిధిలో ఆదివారం ఒక్కరోజే 100 ఫైన్లు విధించిన ట్రాఫిక్ పోలీసులు రూ. 50 వేలు వరకు అపరాధ రుసుం చలానాల రూపంలో వసూలు చేశారు.
హెల్మెట్ ధరించని వారే టార్గెట్
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌లు ధరించకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఆది వారం 18మంది హెల్మెట్లు ధరించనివారిపై ఫైన్లు వేశామని ట్రాఫిక్ సీఐ వి.నాగరాజు పేర్కొన్నారు. ఇన్నాళ్లు హెల్మెట్ ధరించకపోతే రూ.100 లు యాప్‌లో అప్‌లోడ్ అయ్యేదని ఇప్పుడు రూ. 1000 అవ్వడంతో రూ. 18 వేలు వీరి నుంచి చలానాల రూపంలో అప్‌డేట్ అయ్యిందన్నారు. నగర పరిధిలో తిరిగే వాహనదారులు హెల్మెట్లు పెట్టనక్కరలేదని, సర్వోన్నత న్యాయస్థానం చెప్పిందని ఏవేవో చెప్పి వాదిస్తున్నారని, అలాంటిదేమీ లేదని తప్పనిసరిగా హెల్మెట్లు పెట్టాల్సిందేనని సీఐ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏడురోడ్ల కూడలిలో ఆదివారం రాత్రి వాహనదారులకు అవగాహన కల్పించామన్నారు.
కొత్త జరిమానాలు ఇవే..
మోటారు వాహనాల సవరణ చట్టం–2019 ప్రకారం ఈ నెల నుంచి నియమ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు కొత్త జరిమానాలు పడనున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment