ఇద్దరు వ్యక్తులకు గాయాలు
మెళియాపుట్టి: మండలంలోని చాపర నుంచి మెళియాపుట్టికి వెళ్లే రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఒడిశాలోని లావణ్యకోట గ్రామానికి చెందిన జగన్ అనే యువకుడు కుటుంబంతో సహా మెళియాపుట్టి వైపు ద్విచక్ర వాహనంపై ఒక శుభ కార్యానికి వెళ్తున్నాడు. అదే సమయంలో చాపర వైపు బైక్‌పై వెళ్తున్న యువకుడు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. అయితే జగన్ వెనుకన కూర్చున్నవారికి ఎటువంటి గాయాలవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఢీకొన్న యువకుడు ద్విచక్రవాహనం ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు 108 ద్వారా పీహెచ్‌సీకి తరలించారు. కుటుంబ సభ్యులు వచ్చి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment