ఆదిత్యలో గోకార్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు
టెక్కలి: స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సృజనకు పదును పెట్టనుంది. కాలేజీలో మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు గోకార్టింగ్ చాంపియన్‌షిప్ సీజన్–2 పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాల డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు సోమవారం వివరాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు 17 బృందాలుగా 500 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఎండ్యూరెన్స్, ఇన్నోవేషన్, బిజినెస్ ప్లాన్, స్కిడ్‌ప్యాడ్, ఆటోక్రాస్ విభాగాలపై ఏర్పాటు చేస్తున్న ఈ పోటీల్లో పెట్రో ఆధారితమైన 11, ఎలక్ట్రికల్ ఆధారితమైన 6 బృందాలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు రూ.4 లక్షల విలువైన నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆటోమొబైల్ రంగంలో నూతన ఆవిష్కరణలపై విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment